Nick Jonasతో డైవోర్స్ అంటూ రూమర్స్.. స్పందించిన Priyanka Chopra తల్లి.. తర్వాత ఈ బ్యూటీ చేసిన పనితో..

ABN , First Publish Date - 2021-11-23T16:31:37+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ గురించి గత రాత్రి (నవంబర్ 22) నుంచి ఓ వార్త నెట్టింట హల్ ‌చల్ చేస్తోంది. వారు త్వరలో డైవోర్స్ తీసుకోబోతున్నారని దాని సారాంశం...

Nick Jonasతో డైవోర్స్ అంటూ రూమర్స్.. స్పందించిన Priyanka Chopra తల్లి.. తర్వాత ఈ బ్యూటీ చేసిన పనితో..

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ గురించి గత రాత్రి (నవంబర్ 22) నుంచి  ఓ వార్త నెట్టింట హల్ ‌చల్ చేస్తోంది. వారు త్వరలో డైవోర్స్ తీసుకోబోతున్నారని దాని సారాంశం. ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు వెనుక ఉన్న చోప్రా, జోనాస్ పేర్లను తొలగించడంతో ఈ ప్రచారం స్టార్టయింది.


ప్రచారం ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తలపై తాజాగా స్పందించింది. అవన్నీ ఉత్తి మాటలు, పుకార్లు ప్రచారం చేయవద్దంటూ ఓ న్యూస్ వెబ్‌సైట్‌తో చెప్పింది. కొంచెం సమయం తర్వాత ఈ హీరోయిన్ ఓ పని చేసి ఈ వార్తలకు దాదాపు చెక్ పెట్టింది. 


నిక్ జోనాస్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి ‘సోమవారం ప్రేరణ, దాన్ని సాధిద్దాం’ అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు ఈ హాలీవుడ్ నటుడు. దీనిపై స్పందించిన ప్రియాంక.. ‘ఇప్పుడే ఆ కండల్లో పడి చచ్చిపోయానం’టూ కామెంట్ పెట్టింది. దీంతో విడాకుల వార్తలకు ఇన్‌డైరెక్ట్‌గా సమాధానం ఇచ్చినట్లైంది.


కాగా, అందాల తార ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ మొదటి సారి 2017లో జంటగా పబ్లిక్‌లో కనిపించారు. 2018 ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరుపుకొని, డిసెంబర్‌లో జోథ్‌పూర్‌లో పెళ్ళి చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి జోడీ.. సోషల్ మీడియాలో ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా మారిపోయింది.





Updated Date - 2021-11-23T16:31:37+05:30 IST