కాంట్రవర్సీగా మారిన Perfume ad.. Priyanka Chopra నుంచి Richa Chadha వరకు మండి పడుతున్న సెలబ్రిటీలు..

ABN , First Publish Date - 2022-06-06T21:59:43+05:30 IST

వ్యాపార సంస్థలు సేల్స్‌ను పెంచుకోవడానికీ దిగజారి ప్రవర్తిస్తున్నాయి. వివాదస్పదంగా యాడ్‌‌(ad) లను రూపొందిస్తున్నాయి. లైంగిక హింసను ప్రోత్సహించేలా యాడ్‌లను తెరకెక్కిస్తున్నాయి. పర్‌ఫ్యూమ్ బ్రాండ్

కాంట్రవర్సీగా మారిన Perfume ad.. Priyanka Chopra నుంచి Richa Chadha వరకు మండి పడుతున్న సెలబ్రిటీలు..

వ్యాపార సంస్థలు సేల్స్‌ను పెంచుకోవడానికీ దిగజారి ప్రవర్తిస్తున్నాయి. వివాదస్పదంగా యాడ్‌‌(ad) లను రూపొందిస్తున్నాయి. లైంగిక హింసను ప్రోత్సహించేలా యాడ్‌లను తెరకెక్కిస్తున్నాయి. పర్‌ఫ్యూమ్ బ్రాండ్ ‘షాట్’ (SHOT) ఈ మధ్యనే ఓ యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ విడుదలైన కాసేటికే పెను దుమారం రేగింది. వివాదస్పదంగా మారింది. ఈ యాడ్‌పై పలువురు సెలబ్రిటీలు మండిపడుతున్నారు. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), ఫర్హన్ అక్తర్ (Farhan Akhtar), రిచా చద్దా (Richa Chadha), స్వర భాస్కర్ తదితరులు ఇప్పటికే ఈ అంశంపై గళమెత్తారు. 


ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో ఈ యాడ్‌ను ఉద్దేశిస్తూ సిగ్గు చేటని తెలిపారు. ‘‘ఈ యాడ్ అసహ్యకరమైనది. ఈ కమర్షియల్‌ను ప్రసారం చేయడానికి ఎన్ని దశల్లో పర్మిషన్ తీసుకున్నారు. ఎంత మందికి ఇది అమోదయోగ్యం? ఈ యాడ్‌ను మంత్రిత్వశాఖ తొలగించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను’’ అని ప్రియాంక చోప్రా చెప్పారు. ‘‘ఇటువంటి యాడ్‌లను క్రియేట్ చేసేముందు, ప్రసారం చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గ్యాంగ్ రేప్‌లను ప్రోత్సహించేలా ఈ కమర్షియల్ ఉంది. ఇది సిగ్గు చేటు’’ అని ఫర్హన్ అక్తర్ వెల్లడించారు. ‘‘అనుకోకుండా ఈ యాడ్‌ను రూపొందించలేదు. ఒక బ్రాండ్ యాడ్‌ను రూపొందించే క్రమంలో స్క్రిఫ్ట్, ఎజెన్సీ, కాస్టింగ్, క్లైయింట్ లాంటి అనేక దశలుంటాయి. రేప్‌ను అందరు జోక్ అనుకుంటున్నారా? బ్రాండ్ మీద, యాడ్‌ను రూపొందించిన ఏజెన్సీ మీద దావా వేయాలి’’ అని రిచా చద్దా పేర్కొన్నారు.





Updated Date - 2022-06-06T21:59:43+05:30 IST