Priyanka Chopra Birthday: ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇదీ.. ఆ హీరోయిన్ల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్..!

ABN , First Publish Date - 2022-07-19T02:08:46+05:30 IST

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు భాషల్లో నటించి అభిమానులను మెప్పించింది. గ్లోబల్ స్టార్‌గా

Priyanka Chopra Birthday: ప్రియాంక చోప్రా రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇదీ.. ఆ హీరోయిన్ల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్..!

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు భాషల్లో నటించి అభిమానులను మెప్పించింది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. ప్రియాంక జులై 18న పుట్టిన రోజు జరుపుకొంటుంది. ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగినప్పటికీ అనేక సక్సెస్ ఫుల్ సినిమాలను వదులుకొంది. అలా వదులుకున్న చిత్రాలు మరో హీరోయిన్ వద్దకు వెళ్లి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. అలా ప్రియాంక చోప్రా వదులుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దామా.. 


కాక్ టెయిల్ (Cocktail):

సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన సినిమా ‘కాక్ టెయిల్’. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈ మూవీ దీపిక కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్ అవకాశం ప్రియాంక చోప్రాకే లభించింది. కానీ, ప్రియాంక రిజెక్ట్ చేయడంతో ఈ మూవీలో దీపికకు అవకాశం లభించింది. 


సుల్తాన్ (Sultan):

సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన మూవీ ‘సుల్తాన్’. ఈ సినిమాలో అనుష్క శర్మ హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ అవకాశం ప్రియాంక చోప్రాకే వచ్చింది. కానీ, తన కజిన్ పరిణీతి చోప్రా కోసం ఆమె ఈ మూవీని వదులుకుంది. చివరికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేసే అవకాశం అనుష్క శర్మ‌కు వచ్చింది. 


రోబో (Robot):

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటి అరుదైన అవకాశం ప్రియాంక చోప్రా తలుపుతట్టింది. ‘రోబో’ లో ఛాన్స్ వచ్చింది.  కానీ, డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. అనంతరం ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను ఐశ్వర్య రాయ్ పోషించింది. 


రేస్ 2 (Race 2): 

ప్రియాంక చోప్రా వదులుకున్న మరో సినిమా కూడా దీపికా పదుకొణెకు హిట్‌ను తెచ్చిపెట్టింది. ‘రేస్-2’ లో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ మొదటగా ప్రియాంకను సంప్రదించారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రంలో ఆమె నటించలేదు. అనంతరం మేకర్స్ దీపికను ఈ మూవీలోకి తీసుకున్నారు. 


భారత్ (Bharat):

ఈ మూవీతోనే ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను చేయడానికి ప్రియాంక కూడా అంగీకరించింది. మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి ప్రియాంక తప్పుకుంది. తర్వాత హీరోయిన్ ఛాన్స్ కత్రినకు దక్కింది.   


Updated Date - 2022-07-19T02:08:46+05:30 IST