‘ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు’.. ట్యాగ్ ఎవరికంటే: ప్రియాంకా అరుళ్ మోహన్

ABN , First Publish Date - 2022-03-09T01:33:38+05:30 IST

ప్రియాంకా అరుళ్ మోహన్.. తెలుగు వారికి పరిచయం ఉన్న పేరే. తెలుగులో నానితో ‘గ్యాంగ్ లీడర్’, శ‌ర్వానంద్‌తో శ్రీకారం చిత్రాల్లో ఆమె నటించింది. ఈ సినిమాలతో త‌న‌కు పెద్ద‌గా పేరు రాక‌పోయినా త‌మిళంలో శివ‌కార్తికేయన్‌తో చేసిన

‘ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు’.. ట్యాగ్ ఎవరికంటే: ప్రియాంకా అరుళ్ మోహన్

ప్రియాంకా అరుళ్ మోహన్.. తెలుగు వారికి పరిచయం ఉన్న పేరే. తెలుగులో నానితో ‘గ్యాంగ్ లీడర్’, శ‌ర్వానంద్‌తో శ్రీకారం చిత్రాల్లో ఆమె నటించింది. ఈ సినిమాలతో త‌న‌కు పెద్ద‌గా పేరు రాక‌పోయినా త‌మిళంలో శివ‌కార్తికేయన్‌తో చేసిన ‘డాక్ట‌ర్’ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. తెలుగులోనూ ఆ చిత్రం విడుద‌లైంది. ఇప్పుడు త‌మిళంలో సూర్య‌ సరసన ‘ఈటి’ (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ విడుదలవుతోంది. పాండిరాజ్ దర్శకత్వంలో.. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టాలీవుడ్‌లో విడుదల చేస్తోంది. మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోన్న ఈ చిత్రం గురించి హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ మీడియాతో ముచ్చటించారు.


ఆమె మాట్లాడుతూ..

ఇప్పటి వరకు తెలుగులో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర చేయలేదు. కానీ ‘ఈటి’ చిత్రంలోని నా పాత్రను మ‌హిళ‌లు స్పూర్తిగా తీసుకుంటార‌ని చెప్ప‌గ‌ల‌ను. ఇందులో నాది పవర్‌ఫుల్ రోల్‌. రెండు వేరియేష‌న్స్ ఉంటాయి. ఇంట‌ర్‌వెల్‌కు ముందు చాలా హ్యాపీగా ఉండే పాత్ర నాది. సెకండాఫ్‌లో ఓ కారణం కోసం త‌ను ఏవిధంగా మారింది? అనేది పాయింట్‌. సూర్య‌గారికి, నాకూ స‌మాన‌స్థాయిలో పాత్ర ఉంటుంది. క‌థ విన్న‌ప్పుడే నాకు బాగా న‌చ్చింది. త‌మిళంలో ‘డాక్ట‌ర్‌’ సినిమా చేశాను. ఆ త‌ర్వాత అదే హీరోతో ‘డాన్’ చేశాను. అప్పుడు నాకు ఈ ఆఫ‌ర్ వ‌చ్చింది. డాక్ట‌ర్ రిజ‌ల్ట్ చూశాక ఈ సినిమాలో అవకాశం వచ్చింది.


ఇందులో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంటే కాకుండా చ‌క్క‌టి లవ్ స్టోరీ కూడా వుంది. నా పాత్ర గురించి చెప్ప‌గానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇప్ప‌టి ప‌రిస్థితుల‌లో బాధ్య‌త‌గ‌ల పాత్ర అది. చాలామంది ఆడ‌వాళ్ళు ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. అందుకే సొసైటీకి నా పాత్ర బాధ్య‌త‌గా భావించాను. మ‌హిళ‌ల‌ను ఎడ్యుకేట్ చేస్తోంది. అందుకే నా పాత్ర‌ను ప్రాప‌ర్‌గా చేయాల‌ని ముందుకు వ‌చ్చాను. నా పాత్ర‌కు ఓ అర్థం కూడా ఉంటుంది. ద‌ర్శ‌కుడు ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేయాల‌ని చేశాను. ఇది ద‌ర్శ‌కుడి ఆలోచ‌న నుంచి వ‌చ్చింది. క‌థ రాసుకున్నాకే హీరోయిన్‌కు ప్రాధాన్య‌త ఉంది కాబ‌ట్టి ఆ త‌ర్వాత ఇది నాకు చెప్పారు. ఇందులో పాట‌లు కూడా ఉన్నాయి. కానీ అంత‌కంటే సొసైటీపై బాధ్య‌త కూడా నా పాత్ర‌పై ఉంటుంది. అందుకే న‌చ్చింది. అలాగే ‘ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు’ కాప్ష‌న్ గురించి చెప్పాలంటే.. అది హీరోకే కాదు నాకూ వ‌ర్తిస్తుంది. సినిమా చూశాక సొసైటీలో అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని అనిపిస్తుంది. మ‌నం న్యాయంగా ఉంటే ఎవ‌రికీ త‌ల‌వంచాల్సిన ప‌ని లేదనే పాయింట్ ఇందులో చూపించారు. సినిమా చూస్తే పురుషుల‌తో స‌హా అంద‌రూ క‌నెక్ట్ అవుతారు. ఉమెన్స్‌ డేకు రెండు రోజుల ముందు సినిమా రావ‌డం కూడా క‌థ ప‌రంగా క‌రెక్టే అని భావిస్తున్నాను. మ‌హిళలు ఏ రంగంలో వున్నా అంతా హ్యాపీగా ఉండాలి. ప‌నిలోనూ మీ టాలెంట్ చూపించండి. స‌మ‌స్య వ‌స్తే ఎదుర్కోండి..’’ అని తెలిపారు.

Updated Date - 2022-03-09T01:33:38+05:30 IST