Priya Bhavani Shankar: అప్పుడే పెళ్లి చేసుకోవాల్సింది

ABN , First Publish Date - 2022-06-03T19:59:01+05:30 IST

నేను సినిమాల్లోకి అడుగుపెట్టకపోయి ఉంటే ఎపుడో పెళ్లి చేసుకుని స్థిరపడి ఉండేదాన్ని..అని హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) తెలిపింది. బుల్లితెర నుంచి ‘మేయాదమాన్‌’ అనే చిత్రం ద్వారా వెండితెరకు

Priya Bhavani Shankar:  అప్పుడే పెళ్లి చేసుకోవాల్సింది

నేను సినిమాల్లోకి అడుగుపెట్టకపోయి ఉంటే ఎపుడో పెళ్లి చేసుకుని స్థిరపడి ఉండేదాన్ని..అని హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) తెలిపింది. బుల్లితెర నుంచి ‘మేయాదమాన్‌’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ప్రియ.. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం తను నటించిన ‘యానై’ (Yaanai) ఈ నెల 17న విడుదలకు సిద్ధంగావుంది. అలాగే, ‘పత్తు తల’, ‘తిరుచిట్రాంబలం’ (Thiruchitrambalam), ‘రుద్రన్‌’, ‘బొమ్మై’ (Bommai) వంటి పలు ప్రాజెక్టులు తను చేతిలో ఉన్నాయి. 


ఈ నేపథ్యంలో ప్రియా భవానీ శంకర్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రతి  హీరోయిన్‌కు ఉన్నట్టుగానే నాకు కూడా రజనీ, విజయ్‌, అజిత్‌ వంటి పెద్ద హీరోలతో కలిసి డ్యూయట్‌ సాంగ్‌ చేయాలనే ఆశ ఉంటుంది. సినిమా రంగంలో ఇంకా ఉన్నతస్థాయికి చేరుకోవాలనే కోరికతోనే సినీ కెరీర్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. నిజానికి కాలేజీ విద్య పూర్తికాగానే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోవాలని భావించాను. కానీ, అనుకోని విధంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టడంతో నా వివాహం ఆలస్యమవుతుంది’.. అని వివరించింది.


కాగా, ప్రియా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామర్ ఫొటో షూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ అభిమానులకు గ్లామర్ ట్రీస్ట్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు, తెలుగు సినిమాలలో నటించేందుకు అవకాశాల కోసం కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Updated Date - 2022-06-03T19:59:01+05:30 IST