Kaduva: క్షమాపణలు కోరిన పృథ్వీరాజ్ సుకుమారన్

ABN , First Publish Date - 2022-06-29T00:59:41+05:30 IST

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ (shaji kailas) కాంబినేషన్‌లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కడువా’ (Kaduva). పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన

Kaduva: క్షమాపణలు కోరిన పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ (shaji kailas) కాంబినేషన్‌లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కడువా’ (Kaduva). పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు నిర్మాతలు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ చిత్రాన్ని వారం రోజులు పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని, నిరాశ పరిచినందుకు క్షమించాలని.. పృథ్వీరాజ్ సుకుమారన్ తన ట్విట్టర్ వేదికగా కోరారు.  


‘‘అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులందరికీ క్షమాపణలు. అనుకోని పరిస్థితుల వలన ‘కడువా’ చిత్రం విడుదల వారం రోజుల (జూలై7 కి)  వాయిదా పడింది. ప్రచార కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తాము. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మీ అందరి ప్రేమ, మద్దతు ఇలాగే కొనసాగాలి’’ అని ట్విట్టర్ ద్వారా పృథ్వీరాజ్ వెల్లడించారు.


ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ (Vivek oberoi) మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించింది. ఇటివలే విడుదలైన చిత్ర టీజర్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. కాగా.. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.



Updated Date - 2022-06-29T00:59:41+05:30 IST