బర్త్‌డే సందర్భంగా Manushi Chhillar కు అదరిపోయే గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు

ABN , First Publish Date - 2022-05-15T01:19:58+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ మనూషి చిల్లర్ (Manushi Chhillar). మిస్ వరల్డ్ టైటిల్‌ను 2017లో గెలుపొందింది. తాజాగా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా

బర్త్‌డే సందర్భంగా Manushi Chhillar కు అదరిపోయే గిఫ్ట్ ఇచ్చిన దర్శకుడు

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అందాల భామ మనూషి చిల్లర్ (Manushi Chhillar). మిస్ వరల్డ్ టైటిల్‌ను 2017లో గెలుపొందింది. తాజాగా బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా రంగప్రవేశం చేయనుంది. ‘పృథ్వీరాజ్’ (Prithviraj) సినిమాలో నటించింది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) పక్కన కనిపించనుంది. ఈ చిత్రాన్ని చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) తెరకెక్కించాడు. మనూషి చిల్లర్ మే 14న పుట్టిన రోజు జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ‘పృథ్వీరాజ్’ దర్శకుడు అదిరిపోయే గిఫ్ట్‌ను ఇచ్చాడు. ‘పృథ్వీరాజ్’ షూటింగ్‌‌లో తొలిరోజు, తొలిసీన్‌లో పాల్గొన్నప్పుడు ధరించిన దుస్తులను ఆమెకు బాహుమతిగా పంపిచాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులకు తెలిపింది. 


మనూషి చిల్లర్ ‘పృథ్వీరాజ్’ లో  రాణి సంయోగిత (Sanyogita) పాత్రలో కనిపించనుంది. తొలి సినిమాలో నటించిన దుస్తులను బాహుమతిగా ఇవ్వడంతో ఆమె ఉబ్బితబ్బిబయింది. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘ఈ బాహుమతి నాకు ఎంతో స్పెషల్. పుట్టిన రోజు సందర్భంగా ఈ గిఫ్ట్ అందడంతో చాలా సంతోషంగా ఉన్నాను. తొలి సినిమాలో ధరించిన అవుట్ ఫిట్స్‌ను బాహుమతిగా ఇచ్చినందుకు దర్శకుడు చంద్ర ప్రకాష్ ద్వివేది‌కీ థాంక్యూ. ఈ ప్రాజెక్టు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. తొలిరోజు, తొలిసీన్‌లో ధరించిన అవుట్ ఫిట్స్‌ను గిఫ్ట్‌గా పంపించడంతో నేను సర్‌ప్రైజ్‌కు లోనయ్యాను. ఈ దుస్తుల మీద క్లిష్టమైన జర్దోసీ వర్క్ ఉంది. సినిమా రంగంలో నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. నాకు చాలా ప్రేమను అందించే చిత్రం దొరికినందుకు అందరికీ రుణపడి ఉంటాను’’ అని మనూషి చిల్లర్ పేర్కొంది. ఈ సినిమా హిస్టరికల్ డ్రామాగా తెరకెక్కింది. మహ్మమద్ ఘోరి (Muhammad of Ghori) దండయాత్రల నుంచి సామాట్ర్ పృథ్వీరాజ్ భారత్‌ను రక్షించిన విధానాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీలో జూన్ 3న విడుదల కానుంది.



Updated Date - 2022-05-15T01:19:58+05:30 IST