Malaika Arora ధరించిన ఈ షార్ట్స్‌ ధరెంతో తెలిస్తే షాకే..

ABN , First Publish Date - 2022-04-24T16:24:00+05:30 IST

గబ్బర్ సింగ్ మూవీలో చేసిన ‘కెవ్వు కేక’ ఐటమ్ సాంగ్‌తో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా. ఈ బ్యూటీ సినిమాలకే..

Malaika Arora ధరించిన ఈ షార్ట్స్‌ ధరెంతో తెలిస్తే షాకే..

గబ్బర్ సింగ్ మూవీలో ‘కెవ్వు కేక’ ఐటమ్ సాంగ్‌తో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా. ఈ బ్యూటీ సినిమాలకే కాకుండా ఫ్యాషన్ సెన్స్‌కి కూడా ఎంతోమంది అభిమానులున్నారు. అందుకే ఎప్పటికిప్పుడూ కొత్త కొత్త స్టైల్స్, డ్రెస్సుల్లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామకి సంబంధించి ఓ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ అప్‌లోడ్ చేసిన ఆ పిక్‌లో మలైకా గుస్సీ షార్ట్, జాకెట్ ధరించింది. ఆ బ్రాండ్ పేరు చెబితేనే చాలామందికి దాని ఖరీదు మామూలుగా ఉండదని అర్థమవుతుంది. అన్నింటిలాగే ఈ షార్ట్స్ ధర సైతం మలైకా ఫ్యాన్స్‌కి షాకయ్యేలా చేస్తోంది. ఎందుకంటే దాని ధర దాదాపు 1400 డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీలో 1 లక్ష 7 వేల రూపాయలు అన్నమాట. అందుకే నెట్టింట దీని ధరపై విపరీతమైన చర్చ జరుగుతోంది.



Updated Date - 2022-04-24T16:24:00+05:30 IST