Tollywood: అఫీషియల్.. బడ్జెట్ కంట్రోల్‌ విషయంలో నిర్మాతల నిబంధనలివే?

ABN , First Publish Date - 2022-09-02T03:11:35+05:30 IST

సినిమా బడ్జెట్ తగ్గించే విషయంలో గత కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేసి నిర్మాతలు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోని అన్ని శాఖల వారితో కూలంకషంగా

Tollywood: అఫీషియల్.. బడ్జెట్ కంట్రోల్‌ విషయంలో నిర్మాతల నిబంధనలివే?

సినిమా బడ్జెట్ తగ్గించే విషయంలో గత కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేసి నిర్మాతలు (Producers) చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోని అన్ని శాఖల వారితో కూలంకషంగా చర్చలు జరిపి.. ఫైనల్ అభిప్రాయాన్ని నిర్మాతలు తెలియజేస్తామని మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలకు సంబంధించి.. ఎప్పటి కప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అధికారికంగా ప్రెస్ నోట్‌ని విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 25 నుండి షూటింగ్స్‌ చేసుకోవాలనుకునే వారు నిర్మాతల మండలి నుండి అనుమతి తీసుకుని చేసుకోవచ్చని.. సెప్టెంబర్ 1 నుండి పూర్తి స్థాయిలో షూటింగ్స్ జరుపుకోవచ్చని ఇప్పటికే నిర్మాతల సైడ్ నుండి ప్రకటన వచ్చింది. తాజాగా ఇప్పటి వరకు జరిపిన చర్చలకు సంబంధించిన సమాచారాన్ని తెలుపుతూ.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) తరపున అధికారికంగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. 


ఇందులో.. ఇప్పటి వరకు అందరితో జరిపిన చర్చల అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, అవన్నీ సెప్టెంబర్ 10వ తేదీ నుండి అమలులోకి వస్తాయని తెలుపుతూ.. 4 పాయింట్స్‌ని వివరంగా తెలిపారు. 


1. ప్రొడక్షన్ ఆఫ్ ఫిల్మ్

- ఇకపై నటీనటులకు, సాంకేతిక నిపుణులకు డైలీ వైజ్ చెల్లింపులు ఉండవు. 

- నటీనటులందరి రెమ్యునరేషన్స్ వారు చేస్తున్న పాత్ర లేదంటే చిత్రాన్ని బట్టి నిర్మాతే నిర్ణయించడం జరుగుతుంది. ఒక్కసారి ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ నిర్ణయించిన తర్వాత.. వారి అసిస్టెంట్స్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, వారు బస చేసే హోటల్స్, స్పెషల్ ఫుడ్ అన్నీ ఆ రెమ్యూనరేషన్ పరిధిలోనే ఉంటాయి. నటీనటులు రెమ్యూనరేషన్ ఓకే చేసిన తర్వాత.. ఆ అమౌంట్ మినహా నిర్మాత నుండి ఇక ఎటువంటి చెల్లింపులు ఉండవు. 


-సాంకేతిక నిపుణులకు సైతం ఒక్కసారి రెమ్యూనరేషన్ మాట్లాడుకున్న తర్వాత.. అందులోనే అన్నీ చూసుకోవాలి. అదనంగా ఎటువంటి చెల్లింపులు నిర్మాతల నుంచి ఉండవు. 


- సినిమా షూటింగ్ ప్రారంభించే ముందే రెమ్యూనరేషన్లతో సహా అన్ని ఒప్పందాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒప్పందాలన్నీ ఛాంబర్ ద్వారానే నిర్ధారించబడతాయి


- కాల్ షీట్స్ విషయంలో ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. నిర్మాత ప్రయోజనం నిమిత్తం.. షూటింగ్‌కి సంబంధించిన రోజువారీ నివేదికను ఏర్పాటు చేయాలి. 


2. ఓటీటీ


-సినిమా టైటిల్స్, అలాగే థియేట్రికల్ రిలీజ్ పబ్లిసిటీ సమయాలలో ఓటీటీ మరియు శాటిలైట్ పార్టనర్స్ సంబంధించిన సమాచారం చెప్పరాదు. 


- 8 వారాలకు వరకు ఓటీటీలో సినిమా విడుదల చేయరాదని నిర్ణయించడం జరిగింది.


3. థియేట్రికల్/ ఎగ్జిబిషన్


-విపిఎఫ్‌కు సంబంధించిన చర్చలు సెప్టెంబర్ 3న జరగాల్సి ఉండగా.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వారు ఈ సమావేశాన్ని సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది.


- ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పర్సంటేజే ఆంధ్రప్రదేశ్ మల్టీప్లెక్స్‌కు వర్తిస్తుంది


4. ఫెడరేషన్


ఫెడరేషన్ వారితో చివరి దశ చర్చలు నడుస్తున్నాయి. అవి అయిన తర్వాత ఫైనల్ రేటు కార్డ్స్‌ని అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది.



Updated Date - 2022-09-02T03:11:35+05:30 IST