అధ్యక్షా.. లైఫ్‌ అంటే ఇట్టా ఉండాల!

ABN , First Publish Date - 2022-05-18T05:52:26+05:30 IST

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌ 3’. తమన్నా, మెహరీన్‌ నాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు...

అధ్యక్షా.. లైఫ్‌ అంటే ఇట్టా ఉండాల!

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌ 3’. తమన్నా, మెహరీన్‌ నాయికలు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. శిరీష్‌ నిర్మాత. ఈనెల 27న విడుదల కానుంది. మంగళవారం ‘అధ్యక్షా.. లైఫ్‌ అంటే ఇట్టా ఉండాల’ అనే పార్టీ సాంగ్‌ని విడుదల చేశారు. వెంకీ, వరుణ్‌ పూజా హెగ్డే తో పాటుగా సునీల్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు ఈ పాటలో నర్తించారు. చివర్లో అనిల్‌ రావిపూడి కూడా మెరిశారు. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటని రాహుల్‌ సిప్లిగంజ్‌, గీతా మాధురి ఆలపించారు.  దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ‘‘ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్‌ కూడా ఆకట్టుకొంటోంది. ఇవన్నీ ‘ఎఫ్‌ 3’పై అంచనాలు అమాంతం పెంచేశాయి. ‘ఎఫ్‌ 2’కి మించిన వినోదం ఇందులో ఉండబోతోంద’’ని దిల్‌ రాజు తెలిపారు. 


Updated Date - 2022-05-18T05:52:26+05:30 IST