Praveen Sattaru: స్పై థ్రిల్లర్స్ మాత్రమే కావాలి... ఈసారి మెగా హీరోతో

ABN , First Publish Date - 2022-08-18T19:43:51+05:30 IST

బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru). 2011 నుంచి సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 2017లో psv గరుడ వేగ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు.

Praveen Sattaru: స్పై థ్రిల్లర్స్ మాత్రమే కావాలి... ఈసారి మెగా హీరోతో

బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru). 2011 నుంచి సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 2017లో psv గరుడ వేగ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఆడియన్స్ కూడా మర్చిపోయిన రాజశేఖర్ తో స్పై థ్రిల్లర్ జానర్ లో సినిమా చేసి హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు... తన హిట్ ఫార్ములానే రిపీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కింగ్ నాగార్జున (Nagarjuna)తో ప్రవీణ్ చేస్తున్న The Ghost సినిమా కూడా స్పై థ్రిల్లర్ గానే తెరకెక్కుతుంది. 


నాగార్జున కిల్లింగ్ మెషిన్ గా నటించిన ఈ మూవీ షూటింగ్ మొత్తం ఫారిన్ ల్యాండ్ మీదే జరిగింది. అక్టోబర్ 5న ది ఘోస్ట్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్న ప్రవీణ్, తన నెక్స్ట్ సినిమాని కూడా స్పై థ్రిల్లర్ జానర్ లోనే చేయబోతున్నాడట. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ స్పై థ్రిల్లర్ కోసం ప్రవీణ్ సత్తారుతో కలవబోతున్నాడు. మోస్ట్లీ నవంబర్ లో అఫీషియల్ గా అనౌన్స్ అవ్వనున్న ఈ మూవీని కూడా ఫారిన్ ల్యాండ్ లోనే షూట్ చేసేలా ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేస్తున్నాడట. 


లవ్ బిఫోర్ వెడ్డింగ్ నుంచి గుంటూరు టాకీస్ వరకూ కొత్త కొత్త కథా కథనాలతో సినిమా చేసిన ప్రవీణ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి వెరైటీ ఆఫ్ కంటెంట్ ని ఆడియన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. హిట్ వస్తుంది కదా అని ప్రవీణ్ ఒకే జానర్ లో సినిమాలు చేస్తూ వెళ్లడం మంచిది కాదు. టూ మచ్ ఆఫ్ anything is good for nothing అనే సామెతని ప్రవీణ్ సత్తారు చదివే ఉంటాడు. సో అది మైండ్ లో పెట్టుకోని కాస్త గ్యాప్ ఇచ్చి జానర్ ని రిపీట్ చేయడం బెటర్.

Updated Date - 2022-08-18T19:43:51+05:30 IST