ముంబైలో Modi పర్యటన... టాలెంటెడ్ నటుడితో పోలీసుల దురుసు ప్రవర్తన...

ABN , First Publish Date - 2022-04-25T18:35:10+05:30 IST

టాలెంటెడ్ నటుడు ప్రతీక్ గాంధీ ముంబై పోలీసుల చేతుల్లో తనకు ఎదురైన అవమానాన్ని ట్విట్టర్‌లో నెటిజన్స్‌తో పంచుకున్నాడు. ‘వీఐపీ మూమెంట్’తో తాను పడ్డ ఇబ్బందిని ఆన్‌లైన్‌లో వివరించాడు. రోడ్డు మీద వాహనాలు భారీగా ఆగిపోవటంతో షూటింగ్ స్పాట్‌కి నడుస్తూ బయలుదేరానని చెప్పిన ఆయన... పోలీసుల దురుసు ప్రవర్తనని తన తాజా సొషల్ మీడియా పోస్టులో చెప్పుకొచ్చాడు.

ముంబైలో Modi పర్యటన... టాలెంటెడ్ నటుడితో పోలీసుల దురుసు ప్రవర్తన...

టాలెంటెడ్ నటుడు ప్రతీక్ గాంధీ ముంబై పోలీసుల చేతుల్లో తనకు ఎదురైన అవమానాన్ని ట్విట్టర్‌లో నెటిజన్స్‌తో పంచుకున్నాడు. ‘వీఐపీ మూమెంట్’తో తాను పడ్డ ఇబ్బందిని ఆన్‌లైన్‌లో వివరించాడు. రోడ్డు మీద వాహనాలు భారీగా ఆగిపోవటంతో షూటింగ్ స్పాట్‌కి నడుస్తూ బయలుదేరానని చెప్పిన ఆయన... పోలీసుల దురుసు ప్రవర్తనని తన తాజా సొషల్ మీడియా పోస్టులో చెప్పుకొచ్చాడు.


‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్‌లో హర్షద్ మెహతా పాత్రలో అద్భుతంగా నటించిన ప్రతీక్ గాంధీ దేశ వ్యాప్తంగా 

అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కానీ, ముంబై పోలీసులు బహుశా ఆయనని గుర్తుపట్టినట్టు లేదు. అందుకే, ప్రతీక్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా భుజం పట్టుకుని పక్కకు లాగి ఓ వేర్‌హౌజ్‌లోకి నెట్టేశారట! ఇంతకీ, వారు అలా చేయటానికి కారణం ఏంటంటే... 


ముంబైలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆయన కోసం కొన్ని రూట్లలో వాహనాల్ని పోలీసులు కొద్దిసేపు ఆపేశారు. సరిగ్గా అదే సమయంలో షూటింగ్ స్పాట్‌కి బయలుదేరిన ప్రతీక్ గాంధీ ట్రాఫిక్ జామ్ చూసి నడక మొదలెట్టాడు. కానీ, పోలీసులు రోడ్డు మీద వెళుతోన్న ఆయన్ని ఎటువంటి సూచనా, ఆదేశం లేకుండానే పక్కకు లాగేశారట. వారలా చేయటం అవమానకరంగా అనిపించిందంటూ గాంధీ ట్వీట్ చేశాడు. అయితే, ఆయనకి చాలా మంది నెటిజన్స్ అసలు విషయం చెప్పారు. నగరంలో ప్రధాని పర్యటిస్తున్నారని రిప్ల్సై ఇచ్చారు. ‘‘అయ్యో! నాకు ఆ సంగతి తెలియదు’’ ఓ నెటిజన్ కామెంట్‌కి బదులిచ్చాడు ప్రతీక్. 


గుజరాతీ సినీ పరిశ్రమలో మంచి పేరుంది ప్రతీక్ గాంధీకి. అయితే, బాలీవుడ్‌లో ఇంకా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులకైతే ఫేవరెట్ అయిపోయాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్న గాంధీ ఈ మధ్యే ‘పూలే’ సినిమా ప్రారంభించాడు. ‘మహాత్మా పూలే’గా ఆయన అప్‌కమింగ్ బయోపిక్‌లో కనిపించనున్నాడు... 

Updated Date - 2022-04-25T18:35:10+05:30 IST