10 మంది హీరోయిన్స్‌తో ప్రశాంత్‌ వర్మ ప్రయోగం

ABN , First Publish Date - 2022-04-29T00:08:58+05:30 IST

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా ‘హనుమాన్’ అనే సూపర్ హీరో సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో మూవీగా ఈ సినిమా ప్రత్యేకతను చాటుకుంటోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదే చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత ప్రశాంత్ వర్మ ఓ ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం. పదిమంది హీరోయిన్స్‌తో ఒక కథ రెడీ చేస్తున్నారట.

10 మంది హీరోయిన్స్‌తో ప్రశాంత్‌ వర్మ ప్రయోగం

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా ‘హనుమాన్’ అనే సూపర్ హీరో సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో మూవీగా ఈ సినిమా ప్రత్యేకతను చాటుకుంటోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదే చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత ప్రశాంత్ వర్మ ఓ ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం. పదిమంది హీరోయిన్స్‌తో ఒక కథ రెడీ చేస్తున్నారట. ఇదొక డిఫరెంట్ సబ్జెక్ట్. ఒక పాత్రకి మరో పాత్రకి ముడివేస్తూ చివర్లో ఆ చిక్కుముడులన్నీ తన స్ర్కీన్‌ప్లే మ్యాజిక్‌తో రివీల్ చేసేలా డిజైన్ చేశారట.  దీనికోసం ఓ డిఫరెంట్ స్ర్కీన్‌ప్లేను రాసుకుంటున్నారని టాక్.

 

ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం అనుపమా పరమేశ్వరన్ ను దర్శకుడు సంప్రదించడం, ఆమె ఓకే చేయడం జరిగిపోయిందట. మిగతా హీరోయిన్స్‌ను కూడా పేరున్న వారినే తీసుకుంటున్నారని వినికిడి. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ‘హనుమాన్’ చిత్రం కంప్లీట్ అయ్యాకా.. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. మరి ప్రశాంత్ వర్మ ప్రయోగం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-04-29T00:08:58+05:30 IST