Box Office: రాజమౌళి జస్ట్ నిప్పంటించాడు, ప్రశాంత్ నీల్ ఏకంగా..!

ABN , First Publish Date - 2022-07-22T02:43:23+05:30 IST

ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli), ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అండ్ ట్రేడ్‌ని కన్సిడర్ చేసి, ఒక ఎనాలిసిస్ చేస్తే.. జస్ట్ హీరో పేరు లేకుండా, ఇది ఎస్ఎస్

Box Office: రాజమౌళి జస్ట్ నిప్పంటించాడు, ప్రశాంత్ నీల్ ఏకంగా..!

ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli), ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అండ్ ట్రేడ్‌ని కన్సిడర్ చేసి, ఒక ఎనాలిసిస్ చేస్తే.. జస్ట్ హీరో పేరు లేకుండా, ఇది ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ అనే స్టాంప్ వేస్తే  చాలు.. ఆ మూవీ మార్కెట్ 800 కోట్లు. ఈ 800 కోట్లకి హీరోల మార్కెట్ కూడా కలిసి, అది బాక్సాఫీస్‌ని షేక్ చేసే అంత అవుతుంది. 


ఇంత స్టార్ డమ్‌ని సొంతం చేసుకున్న రాజమౌళి, ‘బాహుబలి’ (Bahubali)తో ప్రభాస్‌(Prabhas)ని పాన్ ఇండియా హీరోని చేశాడు. ఆ తర్వాత రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR)లని కూడా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీతో పాన్ ఇండియా హీరోలని చేశాడు. ఈ ముగ్గురు హీరోలతో రాజమౌళి ఏకంగా 3600 కోట్లు రాబట్టాడు. అంటే రాజమౌళి రీజనల్ సినిమాలతో, రీజనల్ హీరోలతో పాన్ ఇండియా అనే నిప్పుని అలా అంటించి వదిలేశాడు. ఇప్పుడు ఈ నిప్పుతోనే ప్రశాంత్ నీల్ (Prashanth Neel), బాక్సాఫీస్ అనే అడివిని తగలపెట్టడానికి రెడీ అయ్యాడు. 


బాహుబలితో స్టార్ అయిన ప్రభాస్‌తో ‘సలార్’ (Salaar).. ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ అయిన తారక్‌తో ‘ఎన్టీఆర్ 31’, చరణ్‌తో నెక్స్ట్ సినిమా... ఇలా ప్రశాంత్ నీల్ బ్యాక్ టు బ్యాక్ రాజమౌళి హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రశాంత్ లూప్ లైన్‌లో ఉన్న ఈ మూడు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసేంత పొటెన్షియాలిటి ఉన్నవే. మరి రాజమౌళి అంటించిన నిప్పుతో, బాక్సాఫీస్ జంగిల్‌ని తగలెట్టడానికి డిసైడ్ అయిన ప్రశాంత్ నీల్.. ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడో చూడాలి.

Updated Date - 2022-07-22T02:43:23+05:30 IST