Liger: పార్టీలో ఆ కటౌట్‌ని గమనించారా?

ABN , First Publish Date - 2022-08-25T21:26:38+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’ (Liger). ఈ సినిమా ఆగస్ట్ 25 (నేడు)న థియేటర్లలోకి..

Liger: పార్టీలో ఆ కటౌట్‌ని గమనించారా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’ (Liger). ఈ సినిమా ఆగస్ట్ 25 (నేడు)న థియేటర్లలోకి వచ్చింది. సినిమా విడుదలకు ముందు చిత్రయూనిట్ రాకెట్ స్పీడ్‌తో ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. గత వారం, పది రోజులుగా ఎక్కడ విన్నా ‘లైగర్’ మాటే. ఏ నోట విన్నా ‘వాట్ లగా దేంగే’నే. ఇక ప్రమోషన్ల పర్వం ముగిసి.. పార్టీల పర్వం మొదలైంది. రిలీజ్‌కు ముందు రోజు ‘లైగర్’ టీమ్ గ్రాండ్ పార్టీని నిర్వహించింది. ఈ పార్టీకి సంబంధించిన పిక్‌ని తాజాగా విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ పిక్‌లో ఉన్న ఓ కటౌట్.. ఇప్పుడు అనేక చర్చలకి తావిస్తోంది. 


ఇంతకీ ఆ కటౌట్ ఎవరిదని అనుకుంటున్నారా? ‘కెజియఫ్’ సంచలనం ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel)ది. ‘లైగర్’ పార్టీకి.. ప్రశాంత్ నీల్‌కి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? అదే ఇప్పుడు అర్థం కావడం లేదు. పూరీ కొడుతో పాటు.. కోన వెంకట్, మెహర్ రమేష్ వంటి వారు కూడా ఈ పిక్‌లో దర్శనమిచ్చారు. వారంటే.. పూరీతో ఏదో ఒక విధంగా టచ్‌లో ఉండేవారే. కానీ ప్రశాంత్ నీల్ ఎందుకొచ్చినట్లు? ఈ సినిమా తర్వాత విజయ్‌తో ప్రశాంత్ నీల్ ఏమైనా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడా? అనేది క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం ఈ పిక్ మాత్రం ఇటువంటి సందేహాలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ పిక్‌ని షేర్ చేసిన విజయ్.. ‘పైకి అంతా నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాం కానీ.. లోపల ప్యాక్ అవుతోంది.. కానీ ఈ రోజుని నేను నమ్ముతున్నాను.. వాట్ లగా దేంగే’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. 



Updated Date - 2022-08-25T21:26:38+05:30 IST