Prakash raj: ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ.. ఏదీ లేదు!

ABN , First Publish Date - 2021-10-13T00:06:12+05:30 IST

ప్రకాశ్‌రాజ్‌ ‘ఆత్మ’ పేరుతో కొత్త అసోసియేషన్‌ ప్రారంభిస్తున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన ప్యానెల్‌ నుంచి గెలిచిన 11మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ అని ఏదో మొదలు పెడతామని వార్తలొచ్చాయి. నాకు అలాంటి ఆలోచన లేదు.

Prakash raj: ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ.. ఏదీ లేదు!

ప్రకాశ్‌రాజ్‌ ‘ఆత్మ’ పేరుతో కొత్త అసోసియేషన్‌ ప్రారంభిస్తున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. తన ప్యానెల్‌ నుంచి గెలిచిన 11మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ అని ఏదో మొదలు పెడతామని వార్తలొచ్చాయి. నాకు అలాంటి ఆలోచన లేదు. ‘మా’ అసోసియేషన్‌ సమస్యలపై స్పందించటానికే నేను వచ్చాను. వీలైతే ‘మా’లో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తాం తప్ప 10మందిని తీసుకుని కొత్త అసోసియేషన్‌ పెట్టే ఆలోచన లేదు. రెండు వేర్వేరు ప్యానల్స్‌లో గెలిచిన వాళ్లు కలిసి పనిచేసే వాతావరణం ఇక్కడ కనిపించడలం లేదు కాబట్టి మా ప్యానల్‌ సభ్యులు  రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఓడినా, గెలిచినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ప్రతినెలా విష్ణు చేసే డెవలప్‌మెంట్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అడుగుతా. ఆయన చేేస పనిలో మేము అడ్డుపడం. కానీ, పనిచేయకపోతే తప్పకుండా ప్రశ్నిస్తాం’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.


Updated Date - 2021-10-13T00:06:12+05:30 IST