యువతి జీవితంలో వెలుగులు నింపిన Prakash Raj

ABN , First Publish Date - 2021-12-15T02:09:40+05:30 IST

ప్రకాష్ రాజ్ తన మంచి మనసును చాటుకున్నారు. ఒక దళిత యువతి జీవితంలో ఆయన వెలుగులు నింపారు

యువతి జీవితంలో వెలుగులు నింపిన Prakash Raj

ప్రకాష్ రాజ్ తన మంచి మనసును చాటుకున్నారు. ఒక దళిత యువతి జీవితంలో ఆయన వెలుగులు నింపారు. ఒక యువతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచింది. ఆర్థిక పరిస్థితి కారణంగా ఉన్నత చదువులను అభ్యసించలేకపోయింది. దీంతో ఆమె బ్రిటన్‌లో మాస్టర్స్ చదువుకునేందుకు అయ్యే ఖర్చును ప్రకాష్ రాజ్ భరించారు. సినిమా దర్శకుడైన నవీన్ మహ్మదాలీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని డిసెంబర్ 14న వెల్లడించారు.


శ్రీ చందన అనే దళిత యువతి పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. బ్రిటన్‌లో మాస్టర్స్ చదువుకునేందుకు ఆమెకు అవకాశం లభించింది. ఆమె తండ్రి కూడా మరణించాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువుకొలేకపోయింది. ఈ విషయం ప్రకాష్ రాజ్ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె చదువుకయ్యే ఖర్చును ఆయన భరించారు. బ్రిటన్‌లో ఆమె ఉద్యోగం పొందేందుకు కూడా ప్రకాష్ రాజ్ సహాయపడ్డారని ఆయన తెలిపారు.  


‘‘ అవకాశాలు వచ్చి అందుకోలేకపోయిన వారికీ ప్రకాష్ రాజ్ లాంటివారు చీకటిలో ఆశాకిరణంలా కనిపిస్తారు. శ్రీ చందనకు ఆర్థికంగా మీరు సహాయపడ్డారు. ఒక దళిత యువతి బ్రిటన్‌లో మాస్టర్స్ చదువుకునేందుకు అయ్యే ఖర్చును మీరు భరించారు. ఆమె ఉద్యోగం పొందేందుకు కూడా సహాయపడ్డారు. ఒక యువతి జీవితంలో వెలుగుని నింపినందుకు థ్యాంక్ యూ ’’ అని సినిమా దర్శకుడైన నవీన్ మహ్మదాలీ తెలిపారు. 


Updated Date - 2021-12-15T02:09:40+05:30 IST