Love Today: ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ABN , First Publish Date - 2022-11-27T21:52:20+05:30 IST

‘లవ్‌ టుడే’ (Love Today) మూవీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది.

Love Today: ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) హీరోగా నటించిన సినిమా ‘లవ్‌ టుడే’ (Love Today). ఇవానా (Ivana) హీరోయిన్‌గా నటించింది. ప్రదీపే దర్శకత్వం వహించాడు. రూ.7కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఇప్పటి వరకు రూ.50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. తెలుగులోను ఈ సినిమా అదే పేరుతో నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా విజయం దిశగా దూసుకుపోతుంది. థియేటర్స్‌లో నడుస్తుండగానే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది. 


‘లవ్ టుడే’ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలిపింది. సోషల్ మీడియాలో ఓ మెసేజ్‌ను షేర్ చేసింది. ‘‘మీ భాగస్వామితో ఫోన్స్‌ను మార్చుకోవడం రిలేషన్ షిప్‌కు హానికరం. ‘లవ్‌టుడే’ డిసెంబర్ 2 నుంచి ఓటీటీలోకి వచ్చేస్తుంది’’ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా తెలిపింది. కానీ, ఈ చిత్రం ఏయే భాషల్లో విడుదల అవుతుందో చెప్పలేదు. ఈ మూవీలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, రవీనా రవి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక లవ్‌టుడే కథ విషయానికి వస్తే.. ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖిత (ఇవానా) ఒకరినొకరు ప్రేమిచుకుంటారు. పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుంటారు. ఈ జంట ప్రేమ విషయం నిఖిత తండ్రి వేణు శాస్త్రికి (సత్యరాజ్) తెలుస్తుంది. అప్పుడు సత్యరాజ్ ఒక షరతు పెడతాడు. ప్రదీప్, నిఖితలు తమ ఫోన్స్‌ను ఒక్కరోజు మార్చుకోవాలని చెబుతాడు. తర్వాతి రోజు అదే సమయానికి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తాడు. ఫోన్స్ మార్చుకున్నాక ఏం జరిగింది? నిఖిత ఫోన్‌లో ప్రదీప్ ఏం చూశాడు? ప్రదీప్ ఫోన్‌లో నిఖిత‌కి ఏం కనిపించాయి? అయినప్పటికి, వారు పెళ్లి చేసుకున్నారా? లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.



Updated Date - 2022-11-27T21:52:20+05:30 IST