పాత్ర కోసం గెటప్ మార్చేసిన Prabhudeva

ABN , First Publish Date - 2022-07-07T19:45:28+05:30 IST

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌, హీరో, దర్శకుడు ప్రభుదేవా (Prabhudeva) పాత్ర కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. తాజా గా కేవలం ఐదు సెకన్ల సన్నివేశం కోసం ఏకంగా ఆయన

పాత్ర కోసం గెటప్ మార్చేసిన Prabhudeva

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌, హీరో, దర్శకుడు ప్రభుదేవా (Prabhudeva) పాత్ర కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. తాజా గా కేవలం ఐదు సెకన్ల సన్నివేశం కోసం ఏకంగా ఆయన మీసాలు తీయడమే కాకుండా గుండు కూడా గీయించుకున్నారు. రాఘవన్‌ (Raghavan) దర్శకత్వంలో, డి.ఇమ్మాన్‌ (D.Iman) సంగీత సారధ్యంలో ప్రభుదేవా నటించిన చిత్రం ‘మైడియర్‌ భూతం’ (My Dear Bootham:). చిన్నారులను ఆలరించేలా ఈ సినిమా రూపొందించారు.  


అయితే, కొన్ని సెకన్ల సన్నివేశం కోసం మీసాలు తీయడంపై ప్రభుదేవా ఓ ట్వీట్‌ చేశారు. ‘చిన్నతనం నుంచే మీసాలు, గెడ్డం పెంచాను. ఏదో ఒక కారణం చెబుతూ మీసాలు, గెడ్డం ఉంచుకున్నాను. ‘మైడియర్‌ భూతం’ కోసం దర్శకుడు కోరడంతో మొదట నిరాకరించాను. కానీ, అలా చేస్తేనే చిన్నారులు ఎంతగానో ఆనందిస్తారని దర్శకుడు వివరించడంతో అందుకు అంగీకరించాను’ అని వివరించారు. 


కాగా ప్రభుదేవా ఒకవైపు దర్శకుడిగా కొనసాగుతూనే మరొకవైపు తన కొరియోగ్రఫీని కొనసాగిస్తున్నారు. అద్భుతమైన పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఆయన ఎక్కువగా హిందీ సినిమాలను తెరకెక్కించే అవకాశాలను దక్కించుకుంటున్నారు. బాలీవుడ్ మేకర్స్, హీరోలు కూడా ఎక్కువగా ప్రభుదేవాతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను ప్రభుదేవా హిందీ హీరోలతో రీమేక్ చేస్తుండటం విశేషం.  

Updated Date - 2022-07-07T19:45:28+05:30 IST