Gali Nageshwara Rao: మంచు విష్ణు కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్!

ABN , First Publish Date - 2022-05-05T00:32:39+05:30 IST

మంచు విష్ణు (Manchu Vishnu) ‘గాలి నాగేశ్వరరావు’ (Gali Nageshwara Rao) పాత్రలో నటిస్తున్న చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అప్‪డేట్‪ను విడుదల చేశారు. అది అలాంటిలాంటి

Gali Nageshwara Rao: మంచు విష్ణు కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్!

మంచు విష్ణు (Manchu Vishnu) ‘గాలి నాగేశ్వరరావు’ (Gali Nageshwara Rao) పాత్రలో నటిస్తున్న చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అప్‪డేట్‪ను విడుదల చేశారు. అది అలాంటిలాంటి అప్‪డేట్ కాదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ (Indian Michael Jackson)‪గా పేరున్న ప్రభుదేవా (Prabhu Deva).. ఈ చిత్రంలోని ఓ పాటకి కొరియోగ్రఫీ చేయనున్నారని తెలుపుతూ.. మంచు విష్ణు, ప్రభుదేవా కలిసి ఉన్న ఓ పిక్‪ని మేకర్స్ విడుదల చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్‪పుత్ (Payal Rajput) హీరోయిన్‪గా నటిస్తుండగా.. సంచలన నటి సన్నీలియోన్ (Sunny Leone) ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మంచు విష్ణు, పాయల్ రాజ్‪పుత్‪పై రామోజీ ఫిలిం సిటీ(RFC)లో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నట్లుగా తెలుపుతూ.. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందనే నమ్మకాన్ని చిత్రయూనిట్ వ్యక్తపరిచింది.


డా. మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఆశీస్సులతో అవ ఎంటర్‪టైన్‪మెంట్స్ (AVA Entertainments) బ్యానర్‪లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య (Ishan Surya) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  గాలి నాగేశ్వరరావు(Gali Nageswara Rao)గా విష్ణు  మంచు, స్వాతిగా పాయల్ రాజ్‪పుత్, రేణుకగా సన్నీలియోన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్ర్కీన్‪ప్లే‪తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‪గా కోన వెంకట్ (Kona Venkat) వ్యవహరిస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి (G Nageswara Reddy) మూల కథని అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ (Anoop Rubens) సంగీతం సమకూర్చుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Updated Date - 2022-05-05T00:32:39+05:30 IST