Adipurush: అంచనాలను మించేలా టీజర్

ABN , First Publish Date - 2022-10-03T01:11:42+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆది పురుష్’ (Adipurush). ఓం రౌత్ (Om Raut ) దర్శత్వం వహిస్తున్నాడు.

Adipurush: అంచనాలను మించేలా టీజర్

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆది పురుష్’  (Adipurush). ఓం రౌత్ (Om Raut ) దర్శత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ (Kriti Sanon), సైఫ్‌అలీ ఖాన్ (Saif Ali Khan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. తాజాగా అయోధ్యలో టీజర్‌ను రిలీజ్ చేశారు.  టీజర్‌లోని సన్నివేశాలు ‘బాహుబలి’ ని మరిపించేలా ఉన్నాయి.


చెడుపై, మంచి సాధించే విజయానికి ప్రతీకగా ‘ఆది పురుష్’ ను నిర్మించారని తెలుస్తోంది. న్యాయం చేతుల్లోనే అన్యాయం సర్వ నాశనమంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. రాముడిగా అతడి లుక్ ఆకట్టుకుంది. పది తలాల రావణుడిగా సైఫ్ అలీఖాన్ అబ్బురపరిచాడు. రాముడి రూపంలో రామ సేతుపై ప్రభాస్ నడిచి వచ్చే సీన్ సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. నేపథ్య సంగీతం, డైలాగ్స్ మెస్మరైజ్ చేశాయి. 1.46నిమిషాల పాటు ఉన్న టీజర్ మొత్తంగా మూవీపై అంచనాలను పెంచేలా ఉంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. రూ. 500కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని రూపొందించారు. ఐమ్యాక్స్ 3డీలోను సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.   




Updated Date - 2022-10-03T01:11:42+05:30 IST