Salaar : యశ్‌ను తలదన్నే స్థాయిలో ప్రభాస్.. పిక్ లీక్

ABN , First Publish Date - 2022-05-16T16:59:01+05:30 IST

ఇటీవల ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రం సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కన్నడ రాక్ స్టార్ యశ్ (Yash) ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో ఎంతో స్టైలిష్ గా కనిపించాడతడు. అతడి గెటప్ అభిమానులకు తెగ నచ్చేసింది. మొదటి భాగంలో కనిపించిన దానికంటే మరింత హ్యాండ్‌సమ్‌గా రెండో భాగంలో యశ్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఉంటుంది.

Salaar : యశ్‌ను తలదన్నే స్థాయిలో ప్రభాస్..  పిక్ లీక్

ఇటీవల ప్రశాంత్ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రం సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కన్నడ రాక్ స్టార్ యశ్ (Yash) ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో ఎంతో స్టైలిష్ గా కనిపించాడతడు. అతడి గెటప్ అభిమానులకు తెగ నచ్చేసింది. మొదటి భాగంలో కనిపించిన దానికంటే మరింత హ్యాండ్‌సమ్‌గా రెండో భాగంలో యశ్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు చేస్తున్న తదుపరి చిత్రం ‘సలార్’ (Salaar) కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరో కాబట్టి.. మరింతగా హైపు క్రియేట్ అయింది. ఈ సినిమాలోని ప్రభాస్ గెటప్ ఎలా ఉండబోతోందో .. సినిమా అనౌన్స్ మెంట్ రోజున విడుదలైన పోస్టర్స్ ను బట్టి తెలిసింది.  ప్రశాంత్ నీల్ ట్రేడ్‌మార్క్ హీరోయిజానికి తగ్గరీతిలోనే పోస్టర్స్ ఉన్నాయని అభిమానులు సంబరపడ్డారు.  


అయితే తాజాగా ‘సలార్’ (Salaar) చిత్రంలోని ప్రభాస్ (Prabhas) ఆన్ లొకేషన్ పిక్ ఒకటి లీకయి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‌ఆ లీక్డ్ పిక్ చూసిన అభిమానులు తెగ థ్రిల్ అయిపోతున్నారు. ‘కేజీఎఫ్ 2’ లోని యశ్ (Yash) తరహాలో స్టైల్‌గా సూట్‌లో కనిపిస్తున్నాడు ప్రభాస్. ‘బిల్లా,సాహో’ చిత్రాల్లో ఈ తరహా గెటప్ లో ప్రభాస్ కనిపించినా.. అభిమానులకు అవి అంతగా కిక్కివ్వలేదు. అయితే ‘సలార్’ చిత్రంలోని అతడి సూట్ పిక్స్ కు మాత్రం అభిమానులు తెగ ఫిదా అయిపోతున్నారు. ‘కేజీఎఫ్ 2’ లోని యశ్ ను తలదన్నే రీతిలో గెడ్డం, సూట్ లో ప్రభాస్ మెస్మరైజ్ చేస్తున్నాడంటూ.. అభిమానులు ఆ పిక్స్ ను తెగ వైరల్ చేసేస్తున్నారు. సూట్‌లో రివీలైన ప్రభాస్ అగ్రెసివ్ లుక్ కేక పెట్టిస్తోంది. దీంతో ‘సలార్’ చిత్రం ‘కేజీఎఫ్ కా బాప్’ అవుతుందని ప్రచారం మొదలు పెట్టారు అభిమానులు. 


‘సలార్’ (Salaar) షూటింగ్ చివరిదశకు చేరుకుంది. హోంబలే ఫిల్మ్స్ (Hombale films) బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. తమిళ స్టార్ డాటర్ శ్రుతి హాసన్ (Shruthi hasan) కథానాయికగా నటిస్తుండగా.. ‘కేజీఎఫ్’ (KGF) సిరీస్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ దీనికి కూడా సంగీతం అందిస్తున్నాడు. బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపాడు దర్శకుడు. కేజీఎఫ్ సిరీస్ లోని యాక్షన్ సీక్వెన్సెస్ కు మించిన స్థాయిలో ఇందులో యాక్షన్ ఘట్టాలుంటాయని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.  

Updated Date - 2022-05-16T16:59:01+05:30 IST