Prabhas: ఇంట్లో పూజ గది ఉందని.. గుడికి వెళ్లడం మానేస్తామా?

ABN , First Publish Date - 2022-08-04T03:18:22+05:30 IST

‘ఇంట్లో పూజ గది ఉందని.. గుడికి వెళ్లడం మానేస్తామా? మాకు థియేటర్లు గుడి వంటివి..’’ అని అన్నారు గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘సీతా రామం’ (Sita Ramam) ప్రీ రిలీజ్ వేడుకకు

Prabhas: ఇంట్లో పూజ గది ఉందని.. గుడికి వెళ్లడం మానేస్తామా?

‘‘ఇంట్లో పూజ గది ఉందని.. గుడికి వెళ్లడం మానేస్తామా? మాకు థియేటర్లు గుడి వంటివి..’’ అని అన్నారు గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘సీతా రామం’ (Sita Ramam) ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ‘సీతా రామం’ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ఈ జంట కూడా చాలా బాగుంది. ఈ ప్రేమకథలో యుద్ధం కూడా ఉంది. రష్యాలో చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అలాంటిది ఈ చిత్రాన్ని అక్కడ ఎంతో శ్రమ కోర్చి చిత్రీకరించారు. దర్శకుడు హను ఈ చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ఇలాంటి సినిమాలను థియేటర్లలోనే చూడాలి. ఇంట్లో పూజ గది ఉందని.. గుడికి వెళ్లడం మానేయం కదా. మాకు థియేటర్లు అనేవి గుడి లాంటివి. నిర్మాత అశ్వినీదత్ గారు గొప్ప నిర్మాత. ఆయన వంటి వారు తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అని అన్నారు. 


దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna),  హీరో సుమంత్ (సుమంత్) కీలక పాత్రలలో నటించారు.1965 బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై నిర్మాత అశ్వినీ దత్ (Aswini Dutt ) ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - 2022-08-04T03:18:22+05:30 IST