ప్రభాస్‌ పార్టీ.. అదరహో!

ABN , First Publish Date - 2022-06-28T05:47:54+05:30 IST

ఆతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్‌ తరవాతే ఎవరైనా. ఈ విషయం ప్రభా్‌సతో పరిచయం ఉన్నవాళ్లంతా ముక్తకంఠంతో చెబుతారు...

ప్రభాస్‌ పార్టీ.. అదరహో!

ఆతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్‌ తరవాతే ఎవరైనా. ఈ విషయం ప్రభా్‌సతో పరిచయం ఉన్నవాళ్లంతా ముక్తకంఠంతో చెబుతారు. మరోసారి ప్రభాస్‌ అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. ఆయన నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవలే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి ప్రభాస్‌ ఓ స్పెషల్‌ పార్టీ ఇచ్చారు. ఈ విందులో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌తో పాటుగా, కె.రాఽఘవేంద్రరావు, నాని, ‘సలార్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నాగ అశ్విన్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీకి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్‌ కీలక పాత్రఽధారి. 

Updated Date - 2022-06-28T05:47:54+05:30 IST