Prabhas: రామ్ లీలా మైదానంలో రావణ దహనం

ABN , First Publish Date - 2022-10-06T00:07:37+05:30 IST

బాహుబలి ప్రాంచైజీతో దేశంలోని ప్రేక్షకులందరికి చేరువైన నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమాతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Prabhas: రామ్ లీలా మైదానంలో రావణ దహనం

బాహుబలి ప్రాంచైజీతో దేశంలోని ప్రేక్షకులందరికి చేరువైన నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమాతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా రూపొందుతున్నాయి. బాహుబలి (Baahubali) అనంతరం ఆ స్థాయి హిట్ రాకపోయినా అతడి ఫేమ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే, ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). రామాయణాన్ని ఆధారంగా చేసుకుని మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అతడు రాముడి పాత్రను పోషిస్తున్నాడు. అందువల్ల ప్రభాస్ ఎర్రకోట వద్ద రావణ దహనం కార్యక్రమంలో పాల్గొననున్నాడు.


ఢిల్లీలోని రామ్ లీలా మైదానంతో విజయ దశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. హీరో ప్రభాస్ ఉత్సవాల్లో భాగంగా రామ్ లీలా మైదానంలో రావణుడిని దహనం చేయనున్నాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలు దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కోవిడ్ ఫరిస్థితుల్లో రెండేళ్లుగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందువల్ల కమిటీ నిర్వహకులు ఈ సారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హీరో ప్రభాస్ రానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక ‘ఆది‌పురుష్’ విషయానికి వస్తే.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ జానకిగా, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ మధ్యనే  రిలీజైంది. ఈ టీజర్ అన్ని భాషల్లో కలిపి 100మిలియన్స్‌కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.    

Updated Date - 2022-10-06T00:07:37+05:30 IST