రామ్‌చరణ్, ఎన్టీఆర్, యశ్ నుంచి మీకు పోటీ ఉందా..? ప్రభాస్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-15T19:04:00+05:30 IST

‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన టాలీవుడ్ హీరో ప్రభాస్. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన

రామ్‌చరణ్, ఎన్టీఆర్, యశ్ నుంచి మీకు పోటీ ఉందా..? ప్రభాస్ రియాక్షన్ ఏంటంటే..

‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన టాలీవుడ్ హీరో ప్రభాస్. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ చిత్రాలు తెలుగు సినిమా రేంజ్‌ని పెంచాయి. ఈ మూవీస్ అనంతరం ఈ నటుడు చేస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీస్సే. అయితే సుజిత్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘సాహో’ యావరేజ్‌గా మిగలగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాధేశ్యామ్’ సైతం ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో థియేటర్‌లో విడుదలై నెలరోజులు గడవకముందే ఓటీటీలో విడుదలైంది. అంతేకాకుండా త్వరలోనే ప్రముఖ ఛానల్‌లో సైతం ప్రసారం కానుంది.


అయితే.. బాహుబలి సినిమాల వల్ల తెలుగుతోపాటు సౌతిండియా మూవీస్ రేంజ్ పెరిగింది. దీంతో ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’, యశ్ ‘కేజీఎఫ్’ సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా ఈ సౌత్ స్టార్స్‌కి సైతం దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి. దీంతో ఈ నటులకి సైతం ప్రభాస్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.


ఈ తరుణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మీడియాతో మాట్లాడాడు. ఆయన్ని రామ్‌చరణ్, ఎన్టీఆర్, యశ్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నారా అని అడగగా.. ‘ఎక్కడైనా పోటీ అనేది సహజం. కానీ అది మీరు అనుకుంటేనే. ఇప్పుడు చాలా సినిమాలకి దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడింది. మా తాత మైనే ప్యార్ కియా సినిమా చూసి సల్మాన్‌ ఖాన్‌కి అభిమానిగా మారిపోయాడు. అంటే.. ఎప్పటి నుంచో  ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య ఎక్స్‌పోజర్ ఎక్కువైంది అంతే.


చివరికి.. మేమందరం కలిసి భవిష్యత్తులో చాలా భారతీయ సినిమాలు చేయబోతున్నాం. నిజానికి మనం భారతీయ సినిమాని కూడా దాటబోతున్నాం. అందుకే.. ఇక్కడ ప్రత్యర్థి అనేదానికి చోటు లేదు. ఇలాంటి చిత్రాలను తీయడం ఇప్పటికే ఆలస్యం అయ్యిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఉత్తరాది, దక్షిణాది నటులందరం కలిసి భారతీయ చిత్రాలను చేయబోతున్నాం. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.


ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. అది అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు రాజమౌళి కేవలం సౌత్ డైరెక్టర్ కాదు. ఇండియన్ డైరెక్టర్. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకొని 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించడం సంతోషాన్నిచ్చింది’ అని తెలిపాడు.

Updated Date - 2022-04-15T19:04:00+05:30 IST