Prabhas - Maruthi Combo : హంగామా లేకుండా ప్రభాస్ కొత్త సినిమా

ABN , First Publish Date - 2022-08-24T20:52:14+05:30 IST

ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా వున్న ప్రభాస్ (Prabhas) ఇంకో కొత్త సినిమా పూజా కార్యక్రమం గురువారం చెయ్యబోతున్నారు. దీనికి మారుతి (Maruthi) దర్శకుడు కాగా, .పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) వాళ్ళు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.

Prabhas - Maruthi Combo : హంగామా లేకుండా ప్రభాస్ కొత్త సినిమా

ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా వున్న ప్రభాస్ (Prabhas) ఇంకో కొత్త సినిమా పూజా కార్యక్రమం గురువారం చెయ్యబోతున్నారు. దీనికి మారుతి (Maruthi) దర్శకుడు కాగా, .పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) వాళ్ళు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పూజా కార్యక్రమం ఎలాంటి  హంగామా లేకుండానే జరగబోతోంది. ప్రభాస్ సినిమా ప్రారంభం అంటే చాలా గ్రాండ్‌గా జరుగుతుంది కానీ, ప్రభాస్ ఇండియా‌లో లేకపోవటం వలన, కేవలం పూజతో సరి పెట్టేస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా ఎవరు పని చేస్తున్నారు, నటీమణులు ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదని, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చెప్తున్నారు. 


గురువారం మంచి రోజు అని, అదీ కాకుండా, ఆ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పటానికి ఈ చిన్న పూజా కార్యక్రమం పెట్టారని తెలిసింది. ప్రభాస్ ఇప్పుడు మూడు నాలుగు సినిమాలతో చాలా బిజీగా వున్నాడు, అందుకని ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఇంకా క్లారిటీ అయితే లేదు.

Updated Date - 2022-08-24T20:52:14+05:30 IST