Prabhas: ఇలా అయితే దేశంలో ఏ అమ్మాయికి అన్న అవ్వవు!

ABN , First Publish Date - 2022-08-05T02:54:35+05:30 IST

ప్రభాస్ (Prabhas)... ఒకప్పుడు యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star), ఏడేళ్ళ క్రితం రెబల్ స్టార్ (Rebel Star), ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ (Pan India Star). ఆరడుగుల కటౌట్‌కి కేరాఫ్ అడ్రస్ ప్రభాస్. ప్రభాస్‌లో ఉండే రాజసాన్ని

Prabhas: ఇలా అయితే దేశంలో ఏ అమ్మాయికి  అన్న అవ్వవు!

ప్రభాస్ (Prabhas)... ఒకప్పుడు యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star), ఏడేళ్ళ క్రితం రెబల్ స్టార్ (Rebel Star), ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ (Pan India Star). ఆరడుగుల కటౌట్‌కి కేరాఫ్ అడ్రస్ ప్రభాస్. ప్రభాస్‌లో ఉండే రాజసాన్ని మ్యాచ్ చేయడం అసాధ్యం. అలాంటి ప్రభాస్.. అవుట్ ఆఫ్ షేప్ అయ్యాడు, లుక్ అసలు బాగోలేదు.. ఏజ్ అవుతున్నట్లు ఉన్నాడని బాలీవుడ్ మీడియా చాలా ట్రోల్ చేసింది. అందరి నోర్లు మూయిస్తూ ప్రభాస్ సూపర్ మేకోవర్ అయ్యాడు. ఫిట్‌గా, స్టైలిష్‌గా తయారయ్యాడు. గ్రాండ్‌గా జరిగిన ‘సీతా రామం’ (Sita Ramam) ప్రి రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్ గెస్ట్‌గా వచ్చాడు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌ని చూసి అంతా షాకయ్యారు. అంత స్టైలిష్ గా, అంత కూల్‌గా ఉన్నాడు ప్రభాస్. 


‘సలార్’ (Salaar) మూవీలో ఒక క్యారెక్టర్ కోసం ప్రభాస్ బరువు తగ్గుతున్నాడనే వార్త గతంలో వైరల్ అయ్యింది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) పట్టుబట్టి మరీ ప్రభాస్‌ని స్లిమ్‌గా మారాలని చెప్పినట్లుగా టాక్ నడిచింది. ఇప్పుడు ప్రభాస్‌ని చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తోంది. ‘మిర్చి’ (Mirchi) సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.. ‘ఇలా ఉంటే ఈ అమ్మాయికి ఏంటి.. రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్న అవ్వవు అని’. అప్పుడంటే ప్రభాస్ తెలుగు హీరో కాబట్టి కొరటాల శివ (Koratala Siva), రాష్ట్రం వరకే ఆపేశాడు.. కానీ ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్... సో ఆ డైలాగ్‌ని కొంచెం చేంజ్ చేసి కొత్తగా చెబుదాం. ‘ఇంత స్టైలిష్‌గా ఉంటే.. దేశంలో ఏ అమ్మాయికి అన్న అవ్వవు’ ప్రభాస్. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్లు.. ఇంకోసారి ప్రభాస్ కటౌట్ గురించి కామెంట్ చేయాలంటే గట్స్ ఉండాలి డ్యూడ్. అయినా ఈ కామెంట్స్ ఎందుకు డార్లింగ్, అక్కడ ఉన్నది ప్రభాస్ కదా వీలైతే ప్రేమిద్దాం.. ఏమంటారు?



Updated Date - 2022-08-05T02:54:35+05:30 IST