Prabhas: లుక్ అదిరిందిగా..!

ABN , First Publish Date - 2022-08-04T02:54:54+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కోసం, ఆయన సినిమా కోసం.. అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో అనేదానికి సోషల్ మీడియాలే సాక్ష్యం. ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలంటూ..

Prabhas: లుక్ అదిరిందిగా..!

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కోసం, ఆయన సినిమా కోసం.. అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో అనేదానికి సోషల్ మీడియాలే సాక్ష్యం. ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలంటూ.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేస్తున్నారు. అలాంటి వారందరి కోసం సినిమా అప్‌డేట్ రాలేదు కానీ.. ఏకంగా ప్రభాసే మీడియా ముందుకు వచ్చేశాడు. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam). ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభాస్ ఈ వేడుకకు వస్తున్నాడని తెలిసినప్పటి నుండి.. అతని పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వేడుకలో ప్రభాస్ ఎంట్రీ.. అలాగే ఆయన లుక్ అదిరిపోయింది. 


బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో ప్రభాస్ స్టయిలిష్ ఎంట్రీ.. వేడుకకి హాజరైన ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది.. ఎప్పుడెప్పుడు తమ హీరోని చూస్తామా? అని వేచి చూస్తున్న వారికి కనువిందుని కలిగించింది. ట్రిమ్‌డ్ గడ్డం, పవర్‌ఫుల్ మీసాలతో ప్రభాస్ ఇచ్చిన దర్శనం.. ఇప్పుడు సోషల్ మీడియా షేకింగ్‌కి నిదర్శనంగా మారింది. ఈ ఈవెంట్‌లోని ప్రభాస్ ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘లుక్ అదిరింది బాస్, కేక, ఇది కదా మాకు కావాల్సింది..’ అంటూ.. రకరకాల కామెంట్స్‌తో అభిమానులు ప్రభాస్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాగా, టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ ‘సీతా రామం’ చిత్రాన్ని  నిర్మించింది. ఇదే బ్యానర్‌లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ చిత్రం చేస్తున్న విషయం విదితమే.





Updated Date - 2022-08-04T02:54:54+05:30 IST