Prabhas: బాలీవుడ్ మూవీపై క్లారిటీ ఇదేనా..?

ABN , First Publish Date - 2022-06-07T17:55:52+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మరో బాలీవుడ్ సినిమాలో నటించడానికి రంగం సిద్ధమవుతుందా..! అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Prabhas: బాలీవుడ్ మూవీపై క్లారిటీ ఇదేనా..?

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మరో బాలీవుడ్ సినిమాలో నటించడానికి రంగం సిద్ధమవుతుందా..! అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డార్లింగ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సలార్ (Salaar) అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్ (Shruthi Haasan) నటిస్తోంది. అలాగే, సమాంతరంగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక 50వ చిత్రం ప్రాజెక్ట్ కె (Project K) షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. ఇక హిందీలో ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ వీఎఫెక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది.


అయితే, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Sidharth Anand) దర్శకత్వంలో ప్రభాస్ ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ (Mythri Movie Makers) మేకర్స్ హిందీలో స్ట్రైట్ ప్రాజెక్ట్‌గా నిర్మించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమాలు కాకుండా మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్న ప్రభాస్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' అనే సినిమాను చేయాల్సి ఉంది. వీటిలో మారుతి సినిమా ఇదే ఏడాది, సందీప్ రెడ్డి వంగ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వస్తాయని  వార్తలు వస్తున్నాయి.


ఎంతలేదన్నా ఈ సినిమాలలో ప్రభాస్ తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఏడాదిన్నర పడుతుందట. ఇక సిద్ధార్త్ ఆనంద్ కూడా షారుఖ్ ఖాన్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను 2023లో రిలీజ్ చేయబోతున్నారు. దాని తర్వాత ప్రభాస్ హీరో ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా సిద్దంగా ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు మొత్తం బాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయబోతున్నట్టు సమాచారం. మరి అధికారికంగా ప్రభాస్ - సిద్దార్థ్ ఆనంద్ - మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్‌ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. 

Updated Date - 2022-06-07T17:55:52+05:30 IST