పాన్ వరల్డ్ లెవెల్లో Prabhas బాలీవుడ్ చిత్రం..

ABN , First Publish Date - 2022-06-03T15:11:00+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) కమిటైన సినిమాలలో 'ప్రాజెక్ట్ K' (Project K) ఒకటి. ఈ మూవీని పాన్ వరల్డ్ లెవల్‌లో రూపొందిస్తున్నట్టు చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Aswin) వెల్లడించారు.

పాన్ వరల్డ్ లెవెల్లో Prabhas బాలీవుడ్ చిత్రం..

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) కమిటైన సినిమాలలో 'ప్రాజెక్ట్ K' (Project K) ఒకటి. ఈ మూవీని పాన్ వరల్డ్ లెవల్‌లో రూపొందిస్తున్నట్టు చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో 'సలార్' (Salaar) చిత్రాన్ని చేస్తూనే, మరొకవైపు 'ప్రాజెక్ట్ K' సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. 'సలార్' సినిమా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హోంబలే పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. 


ఇప్పటివరకు ఈ సినిమా చిత్రీకరణ 40 శాతం పూర్తైనట్టు సమాచారం. కేజీఎఫ్ సిరీస్‌తో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ అందుకోవడంతో ప్రభాస్ - ప్రశాంత్ నీల్‌ల 'సలార్' మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు పూర్తి భిన్నంగా 'ప్రాజెక్ట్ K' తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ దాదాపు రూ 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణ సంస్థకు ప్రతిష్ఠాత్మక 50వ చిత్రం కావడం విశేషం. అందుకే, ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా హాలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేలా భారీ హంగులతో రూపొందిస్తున్నారు. 


బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ దీపిక పడుకొన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాకంటే ముందే ప్రభాస్ పాన్ వరల్డ్ లెవల్‌లో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అదే 'ఆదిపురుష్' (Adipurush). ఇది బాలీవుడ్‌లో ప్రభాస్ నటిస్తున్న మొదటి చిత్రం. ఓం రౌత్ (Om Raut) తెరకెక్కిస్తున్న ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. 2023, సంక్రాంతి పండుగకు ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' విడుదల కానుంది. అయితే, ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమాను ఇంగ్లీషులో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పలు హాలీవుడ్ సంస్థలతో ఈ విషయమై చర్చలు జరిపారట. దీంతో 'ప్రాజెక్ట్ K' అనుకుంటే, దానికంటే ముందే ప్రభాస్ హాలీవుడ్ మార్కెట్‌లో 'ఆదిపురుష్' ద్వారా అడుగుపెట్టబోతున్నారు. 

Updated Date - 2022-06-03T15:11:00+05:30 IST