Adipurush: అమ్మయ్య.. ఎట్టకేలకు అప్‌డేట్.. అయినా కన్ఫ్యూజనే!

ABN , First Publish Date - 2022-09-27T19:22:00+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) కాంబినేషన్‌లో ‘రామాయణం’ (Ramayanam) ఆధారంగా తెరకెక్కుతోన్న..

Adipurush: అమ్మయ్య.. ఎట్టకేలకు అప్‌డేట్.. అయినా కన్ఫ్యూజనే!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Global Star Prabhas), బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) కాంబినేషన్‌లో ‘రామాయణం’ (Ramayanam) ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ సినిమా అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి తెలుసు. ఎందుకు సోషల్ మీడియా అనాల్సి వచ్చిందంటే.. మేకర్స్ ఎలాగూ అప్‌డేట్ ఇవ్వరు.. వారితో సినిమా ప్రకటన చేయించే వరకు ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) ఏదో విధంగా ఈ సినిమాని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.. ఉంటారు. ఎందుకంటే, సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.. కానీ ఫస్ట్ లుక్ మాత్రం విడుదల చేయలేదు. దీంతో అసలీ సినిమా పరిస్థితి ఏమిటనేది.. ఫ్యాన్స్‌కి అర్థంకాక.. వారంతట వారే.. ఈ సినిమా అప్‌డేట్స్‌ని ప్రకటించుకుంటూ.. ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. (Adipurush Update)


మరి ఇది గమనించారో.. లేదంటే ఇదే కరెక్ట్ సందర్భం అని భావించారో.. తెలియదు కానీ.. ఎట్టకేలకు చిత్ర దర్శకుడు ఓం రౌత్ నుంచి అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. ఎప్పుడూ ఫ్యాన్‌మేడ్ పోస్టర్స్ షేర్ చేసే ఓం రౌత్.. ఈ సారి సినిమా అప్‌డేట్‌ని పోస్ట్ చేయడంతో.. ‘అమ్మయ్య.. ఎట్టకేలకు అప్‌డేట్’, ‘ఎట్టకేలకు నిద్రలేచారు’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


‘‘మా అద్భుతమైన ప్రయాణాన్ని.. మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీరు ఎంతగానో వేచి చూస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్‌, ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నాం. ఉత్తర ప్రదేశ్, అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ సినిమా 12 జనవరి, 2023న ఐమ్యాక్స్ మరియు 3Dలలో విడుదలవుతుంది..’’ అంటూ ఓం రౌత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ప్రభాస్ అభిమానులలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘వీరుడొస్తున్నాడు.. వీరుడొస్తున్నాడు..’ అంటూ ఒకటే కామెంట్స్. ఇక వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ అద్భుతంగా వచ్చిందని తెలుస్తుంది. ఈ టీజర్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్‌ని పట్టుకోవడం కూడా కష్టం అనేలా.. అప్పుడే టాక్ కూడా మొదలైంది. వినిపిస్తున్న ఈ టాక్ ప్రకారం ఆ అద్భుతాన్ని చూడాలంటే.. అది అద్భుతమో, కాదో తేల్చేయాలంటే అక్టోబర్ 02 వరకు వెయిట్ చేయక తప్పదు. ఇంకో విషయం ఏమిటంటే.. ఓం రౌత్ అఫీషియల్‌గా ట్వీట్ చేసినా.. అందులో అక్టోబర్ 2 పక్కన పెట్టిన విరామచిహ్నంతో.. మరోసారి అనుమానాలు వ్యక్తమయ్యేలా చేశాడు. దీంతో.. ఈ టీజర్, ఫస్ట్ లుక్ విడుదలపై ఇంకా క్లారిటీ రానట్లుగానే కొందరు భావిస్తున్నారు. (Prabhas Adipurush Movie)



Updated Date - 2022-09-27T19:22:00+05:30 IST