Pawan Kalyan: అభిమానులకు పవర్ స్టార్ బర్త్ డే కానుక..!

ABN , First Publish Date - 2022-08-28T01:08:50+05:30 IST

హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). చివరగా ‘భీమ్లానాయక్’ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు.

Pawan Kalyan: అభిమానులకు పవర్ స్టార్ బర్త్ డే కానుక..!

హిట్, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). చివరగా  ‘భీమ్లానాయక్’ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అనంతరం రాజకీయ కార్యక్రమాల్లో మునిగిపోవడంతో ఏ సినిమా కూడా అతడి నుంచి రాలేదు. దీంతో అభిమానులు అసంతృప్తిలో మునిగిపోయారు. ఆ అంసతృప్తిని కొంతైనా తీర్చేందుకు పవర్ స్టార్ ప్రయత్నిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2న పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు అభిమానులకు కానుకను అందించబోతున్నట్టు తెలుస్తోంది.  


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ‘వేదం’, ‘మణికర్ణిక’ లను తెరకెక్కించిన క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ.యం. రత్నం రూపొందిస్తున్నాడు. నిధి అగర్వాల్ (Nidhi Agarwal)యువరాణిగా నటిస్తుంది. నోరా ఫతేహీ, అర్జున్ రాంపాల్, ‘కేజీఎఫ్’ ఫేమ్ బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ గత కొంతకాలంగా జరుగుతుంది. పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న ‘హరి హర వీరమల్లు’ కు సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో యాక్షన్ సన్నివేశాలను చూపించబోతున్నారని వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహాలోని పాత్రలో ‘వీరమల్లు’ గా కనిపించి అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రం మొఘలాయీల కాలానికి చెందిన ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కోహినూర్ వజ్రం ప్రస్తావన కూడా ఉండబోతోందని తెలుస్తోంది. పీరియాడికల్ మూవీగా తెరకెక్కబోతుండటంతో కళా దర్శకుడు తోటతరణి ఆధ్వర్యంలో భారీ సెట్స్‌ను వేస్తున్నారు. ఈ చిత్రానికి ఏమ్ఏమ్. కీరవాణీ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో చిత్రం‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Updated Date - 2022-08-28T01:08:50+05:30 IST