లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ Singer కి 30 ఏళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-06-30T15:14:53+05:30 IST

స్టార్‌డమ్ ఉపయోగించుకుని దశాబ్దాలుగా శృంగారం కోసం టీనేజర్లు, మహిళలను ట్రాప్ చేస్తున్న కేసులో ఆర్ అండ్ బీ సింగర్ ఆర్.కెల్లీ (R Kelly)కి..

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ Singer కి 30 ఏళ్ల జైలు శిక్ష

స్టార్‌డమ్ ఉపయోగించుకుని దశాబ్దాలుగా శృంగారం కోసం టీనేజర్లు, మహిళలను ట్రాప్ చేస్తున్న కేసులో ఆర్ అండ్ బీ సింగర్ ఆర్.కెల్లీ (R Kelly)కి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 55 ఏళ్ల కెల్లీని న్యూయార్క్ జ్యూరీ దోషిగా నిర్ధారించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఫెడరల్ కోర్టు (Federal Court) జడ్జి ఆన్.డోన్నెల్లీ బ్రూక్లిన్ ఈ తీర్పుని వెలువరించారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఇస్టర్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌లోని యూఎస్ అటార్నరీ కార్యాలయం ఓ ట్వీట్ సైతం చేసింది.


గత కొంతకాలంగా #MeToo ఉద్యమం విస్తృతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంలో పలువురు మహిళలు కెల్లీ మీద లైంగిక ఆరోపణల కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు గతేడాది సెప్టెంబర్‌లోనే అతన్ని దోషిగా నిర్థారించింది. విచారణలో భాగంగా ఎంతోమంది మహిళలను కెరీర్‌కి సహాయం చేస్తానని, స్టార్ డమ్ వచ్చేలా చేస్తానని చెప్పి లైంగికంగా లోబరుచుకున్నాడని కోర్టులో సాక్ష్యం చెప్పారు. దానివల్ల తాము పలు మానసిక సమస్యలు ఎదుర్కొన్నట్లు అప్పటికీ టీనేజీలో ఉన్న పలువురు మహిళలు చెప్పుకొచ్చారు. కాగా.. కెల్లీ జూలై 2019 నుంచి ఓ విషయమై జైలులోనే ఉన్నాడు.

Updated Date - 2022-06-30T15:14:53+05:30 IST