బటన్ దోశ తయారు చేసిన పాప్ స్టార్ Britney Spears.. ఫిదా అవుతున్న భారతీయ ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-06-08T15:28:45+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్. దాదాపు 13 ఏళ్లు తండ్రి కన్జర్వేటర్‌షిప్‌లో..

బటన్ దోశ తయారు చేసిన పాప్ స్టార్ Britney Spears.. ఫిదా అవుతున్న భారతీయ ఫ్యాన్స్

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్. దాదాపు 13 ఏళ్లు తండ్రి కన్జర్వేటర్‌షిప్‌లో ఉన్న ఈ గాయని ఇటీవలే ఆ బంధనం నుంచి విముక్తి పొందింది. అప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఈ బ్యూటీ బటన్ దోశ తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.


ఈ వీడియో వైరల్‌గా మారడంతో పలువురు భారతీయ ఫ్యాన్స్ ఈ బ్యూటీపై ప్రశంసలు కురిపించారు. అలాగే.. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో పసూరి సాంగ్ ప్లే అవుతోంది. ఈ పోస్ట్‌ని చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చూడడం సంతృప్తికరంగా ఉందంటూ వీడియోపై కామెంట్ల వర్షం కురిపించారు. కొందరూ నెటిజన్స్ అయితే.. ‘వావ్.. బ్రిట్నీ పంజాబీ సంగీతం వింటోంది’ అంటూ.. ‘బ్రిట్నీ నిజంగా బటన్ దోశ చేస్తోందా’ అని మరికొందరు కామెంట్స్ చేశారు. అయితే.. ఈ వీడియోని ఎందుకో ఈ భామ డిలీట్ చేసింది.

Updated Date - 2022-06-08T15:28:45+05:30 IST