Shamnakasim: పూర్ణ పెళ్లి ఆ రోజే!

ABN , First Publish Date - 2022-07-04T02:04:07+05:30 IST

హీరోయిన్‌ పూర్ణ (షమ్నా ఖాసీమ్‌) త్వరలో ఓ ఇంటికి కోడలికి వెళ్లనున్నారు. ఇటీవల షానిద్‌తో ఆమెకు నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే! నవంబర్‌ 6న షానిద్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఓ టీవీ షోలో వెల్లడించారు. యాంకర్‌ రష్మీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే సిగ్గు ఒలకబోస్తూ ఆ విశేషాలు తెలిపారు పూర్ణ.

Shamnakasim: పూర్ణ పెళ్లి ఆ రోజే!

హీరోయిన్‌ పూర్ణ (షమ్నా ఖాసీమ్‌) (Poorna)త్వరలో ఓ ఇంటికి కోడలికి వెళ్లనున్నారు. ఇటీవల షానిద్‌తో ఆమెకు  నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే! నవంబర్‌ 6న షానిద్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఓ టీవీ షోలో వెల్లడించారు. యాంకర్‌ రష్మీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే  సిగ్గు ఒలకబోస్తూ ఆ విశేషాలు తెలిపారు పూర్ణ. పక్కాగా పెద్దలు కుదిర్చిన పెళ్లి అని, వివాహం అనంతరం దుబయ్‌ వెళ్లిపోతానని పూర్ణ చెప్పుకొచ్చారు. ‘సీమ టపాకాయ్‌’ చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన పూర్ణ ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును2’, ‘శ్రీమంతుడు’, ‘సుందరి’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘అఖండ’, ‘దృశ్యం’ చిత్రాలతో అలరించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె నటించిన అరడజను చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. (Poorna marriage on 6 november)




Updated Date - 2022-07-04T02:04:07+05:30 IST