Poonam Pandey: అవును.. నేను చేసినవన్నీ తప్పులే.. కొందరిని నమ్మి..

ABN , First Publish Date - 2022-02-27T17:59:27+05:30 IST

కెరీర్ ప్రారంభం నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలీవుడ్ హాట్‌బ్యూటీ పూనమ్ పాండే. ఈ భామ ప్రస్తుతం కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న లాకప్ రియాలిటీ షోలో పాల్గొంటోంది...

Poonam Pandey: అవును.. నేను చేసినవన్నీ తప్పులే.. కొందరిని నమ్మి..

కెరీర్ ప్రారంభం నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలీవుడ్ హాట్‌బ్యూటీ పూనమ్ పాండే. ఈ భామ ప్రస్తుతం కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న లాకప్ రియాలిటీ షోలో పాల్గొంటోంది. ఈ షోకి సంబంధించిన ప్రొమోని ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ భామ తాజాగా ఓ ఇంటర్య్వూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.


పూనమ్ మాట్లాడుతూ.. ‘నేను కెరీర్ ప్రారంభించినప్పుడు నాకు సరైన అవకాశాలు లేవు. దీంతో ఏదైనా సాధించాలనే కసి ఉండేది. అందుకే ఆవేశంలో కొన్ని తప్పులు చేశాను. కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నాను. అంతేకాకుండా అప్పుడు చాలా యంగ్ ఏజ్‌లో ఉండడంతో నాకు ఈ ఇండస్ట్రీ మీద, సమాజం మీద అంత అవగాహన లేదు. అందుకే అలాంటి పొరపాట్లు చేశాను. అయితే.. తరువాత ఆ నిర్ణయాలు తప్పని, జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పని చేస్తే అంతకుమించిన పని దొరుకుంతుందని తర్వాత అర్థమైంది. ఈ 15 నిమిషాల కీర్తి జీవితంలో అస్సలు ముఖ్యమైనది కాదని నేను గ్రహించాను. ఇకనుండి, నేను ఏదైనా చూపించవలసి వస్తే, నా పని ద్వారా చూపించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.


పూనమ్ 2013లో నషాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. అందులో తన విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకునే ఉపాధ్యాయురాలిగా నటించింది. సినిమా తర్వాత పరిస్థితి కొంచె కష్టంగా మారిందని పూనమ్ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ.. ‘ఆ చిత్రం తర్వాత నాకు ఎలాంటి ఫర్లు వచ్చినా, నా చుట్టూ ఉన్నవారు నన్ను తప్పు డైరెక్షన్‌లో నడిపించడం ప్రారంభించారు. నాకు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పడం ప్రారంభించారు. అయితే, నాకు నటించాలని, పనిచేయాలని, సినిమాలు చేయాలని ఉందని వారితో చెబుతుంటాను. నేను మంచి డ్యాన్సర్‌ని, నటిగా నా టాలెంట్ చూపించాలని చెబుతాను. కానీ కొందరి సలహాల వల్ల, వారిని నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను’ అని తెలిపింది.

Updated Date - 2022-02-27T17:59:27+05:30 IST