‘బావ సినిమాకి వచ్చా అక్కా..’.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

ABN , First Publish Date - 2022-02-26T02:50:45+05:30 IST

నటి పూనమ్ కౌర్ పరిచయం అక్కరలేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కొలేని వారు ఎక్కువగా వాడుకునే పేరు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఈ పేరుపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తుంటాయి. అలాగే పూనమ్ కౌర్ కూడా..

‘బావ సినిమాకి వచ్చా అక్కా..’.. పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

నటి పూనమ్ కౌర్ పరిచయం అక్కరలేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కొలేని వారు ఎక్కువగా వాడుకునే పేరు. అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఈ పేరుపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తుంటాయి. అలాగే పూనమ్ కౌర్ కూడా సోషల్ మీడియాలో సూటిగా చెప్పకుండా చేసే కొన్ని ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. ఈ ట్వీట్స్‌కి నెటిజన్లు రకరకాలుగా అర్థాలు తీస్తుంటారు. ముఖ్యంగా అప్పుడు కూడా పవన్ కల్యాణ్ పేరే ఎక్కువగా వినబడుతుంటుంది. ఇక తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ అయితే పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. ఆమె ఏ మూడ్‌లో ఉండి ఈ పోస్ట్ చేసిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలోని ఒక వర్గానికి మాత్రం బాగా పని కల్పించింది. ఆమె ఒక వాట్సప్ స్టేటస్‌ని ట్వీట్ చేసింది. 


అందులో మ్యాడీ అనే పేరుతో చాట్ జరిగినట్లుగా ఉంది కానీ.. ఒక్కరి పేరు కూడా డిస్‌ప్లేలో చూపించకపోవడం విశేషం. ఇది కావాలని పూనమ్ కౌర్ పోస్ట్ చేసినట్లుగా అయితే ఉంది. ఇందులో ‘ఏంటి’ అని పూనమ్ అడిగినట్లుగా, దానికి సమాధానంగా ‘సినిమాకి వచ్చా అక్కా.. బావ సినిమా, 8 ఏఎమ్’ అని సమాధానం ఉంది. దీనికి పూనమ్ కళ్లు మూసుకున్నట్లుగా ఎమోజీలు పెట్టి.. ‘నిజాయితీగా రివ్యూ ఇవ్వు’ అని పేర్కొంది. ‘అక్కా సినిమా హిట్టు.. నన్ను నమ్ము.. ప్రామిస్ చేస్తున్నా’ అనే సమాధానం ఉంది. ఇది ఆమె పోస్ట్ చేసిన వాట్సప్‌ ఛాట్‌లో ఉన్న విషయం. ఆ తర్వాత ట్వీట్‌లో.. నాలుగేళ్లుగా తాను మళ్లీ మళ్లీ అదే భావోద్వేగానికి లోనవుతున్నానని, అయితే అదంత సులభం కాదని ఆమె అన్నారు. మొదటిసారి సంతోషంగా అనిపించింది.. అందుకే పోస్ట్ చేశానని పూనమ్ తెలిపారు. ఎటువంటి షరతులు లేని ప్రేమతో తన పట్ల బాధ్యత, కృతజ్ఞత చూపేవారిని ఆ దేవుడు చల్లగా చూడాలని ఆమె కోరారు. అయితే ఈ మొత్తం పోస్ట్‌లో ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసింది అనేది మాత్రం క్లారిటీ లేకపోవడంతో నెటిజన్ల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.





Updated Date - 2022-02-26T02:50:45+05:30 IST