పూనమ్‌కౌర్‌: జరిగిన డ్యామేజ్‌ చాలు

ABN , First Publish Date - 2022-05-05T20:32:00+05:30 IST

పూనమ్‌కౌర్‌కు పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారట! ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా విషయమిది. నెట్టింట ఈ వార్త చక్కర్లు కొట్టడానికి ఆమె పోస్ట్‌ చేసిన ఓ ఫొటో కారణం. తాజాగా పూనమ్‌ కౌర్‌ ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేసి ‘హ్యాపీనెస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫొటోపై చర్చ నడుస్తోంది. నెటిజన్లు ఈ ఫొటోను వైరల్‌ చేసి పూనమ్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు అని ప్రచారం చేస్తున్నారు.

పూనమ్‌కౌర్‌: జరిగిన డ్యామేజ్‌ చాలు

పూనమ్‌కౌర్‌కు (poonam kaur)పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారట!

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా విషయమిది. 

నెట్టింట ఈ వార్త చక్కర్లు కొట్టడానికి ఆమె పోస్ట్‌ చేసిన ఓ ఫొటో కారణం.

తాజాగా పూనమ్‌ కౌర్‌ ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేసి ‘హ్యాపీనెస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫొటోపై చర్చ నడుస్తోంది. నెటిజన్లు ఈ ఫొటోను వైరల్‌ చేసి పూనమ్‌కు (poonam kaur)పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం పూనమ్‌కౌర్‌ దృష్టికి వెళ్లగా ఆమె స్పందించారు. ‘నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్‌ చాలు. ఆ పిల్లలిద్దరూ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ పిల్లలు. సోషల్‌ మీడియాకు థ్యాంక్స్‌. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వగలిగే అవకాశం ఉంది. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి’’ అంటూ ట్విట్టర్‌ వేదికగా సమాధానమిచ్చారు పూనమ్‌ కౌర్‌. ఆ ఫొటో ఆధారంగా పలువురు నెటిజన్లు పూనమ్‌ను ట్రోల్‌ చేస్తుంటే... మరికొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి వార్తల్ని మీరు అసలు పట్టించుకోవద్దు అంటూ సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. 



Updated Date - 2022-05-05T20:32:00+05:30 IST