Pooja Hegde కు లక్కీ ఛాన్స్.. KGF 2 సక్సెస్ తర్వాత Yash చేయబోయే సినిమాలో..

ABN , First Publish Date - 2022-06-16T01:43:48+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde). టాలీవుడ్‌ స్టార్ హీరోలందరి సరసన నటించింది. బాలీవుడ్, కోలీవుడ్‌లోను చిత్రాలు చేసింది. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి

Pooja Hegde కు లక్కీ ఛాన్స్.. KGF 2 సక్సెస్ తర్వాత Yash చేయబోయే సినిమాలో..

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde). టాలీవుడ్‌ స్టార్ హీరోలందరి సరసన నటించింది. బాలీవుడ్, కోలీవుడ్‌లోను చిత్రాలు చేసింది. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరో యశ్(Yash) పక్కన పూజ హీరోయిన్‌గా కనిపించనుందని సమాచారం. 


‘కెజియఫ్’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు యశ్. ఈ స్టార్ హీరో తన తర్వాతి ప్రాజెక్టును ఇంత వరకు ప్రకటించలేదు. కానీ, నర్తన్ (Narthan) అనే డైరెక్టర్‌కు యశ్ ఒకే చెప్పినట్టు సమాచారం. నర్తన్ గతంలో ‘మఫ్టీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అభిమానుల మన్ననలు పొందడంతో పాటు  విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. 2017లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. యశ్ చేయబోయే సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా ‘యశ్ 19’ అని పెట్టారు. ఇప్పటికే మేకర్స్ పూజతో చర్చలు జరిపారని సమాచారం. ఒక వేళ ఈ వదంతులు కనుక నిజమైతే స్టార్ హీరో పక్కన పూజా హెగ్డే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. పూజా హెగ్డే ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఆమె తప్పుకొందని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కానీ, ఆమె బృందం మాత్రం ఈ వదంతులను ఖండించింది. ‘‘డేట్స్ ఇష్యూ వచ్చిన మాట వాస్తవమే. కానీ, వాటిని సర్దుబాటు చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ సినిమాను తప్పకుండా చేస్తుంది’’ అని పూజా హెగ్డే టీమ్ పేర్కొంది. 

Updated Date - 2022-06-16T01:43:48+05:30 IST