F3: దుమ్మురేపుతోన్న జిగేల్ రాణి.. ఫొటో వైరల్

ABN , First Publish Date - 2022-04-16T03:07:29+05:30 IST

బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎఫ్‌2 చిత్రం త‌ర్వాత.. అదే సిరీస్‌లో ‘ఎఫ్‌3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా

F3: దుమ్మురేపుతోన్న జిగేల్ రాణి.. ఫొటో వైరల్

బ్లాక్ బస్టర్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎఫ్‌2 చిత్రం త‌ర్వాత.. అదే సిరీస్‌లో ‘ఎఫ్‌3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరే కాకుండా.. ఈ సినిమాకి మరింత అందం యాడ్ అవుతోంది. ‘రంగస్థలం’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌లో నర్తించిన జిగేల్ రాణి పూజా హెగ్డే మరోసారి ఈ చిత్రంలో అదే తరహా పాట చేసేందుకు ఓకే చెప్పింది. ఈ పాటకి సంబంధించిన చిత్రీకరణ శుక్రవారం మొదలైనట్లుగా మేకర్స్ ఓ పిక్ వదిలారు. ఈ పిక్‌లో పూజా దుమ్మురేపుతోంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నపూర్ణ 7 ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వ‌ర్యంలో రూపొందిన అత్యద్భుతమైన సెట్స్‌లో ఈ సాంగ్‌‌ని చిత్రీకరిస్తున్నారు.


రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటకి ఆక‌ర్ష‌ణీయ‌మైన ట్యూన్‌ను సిద్ధం చేశారని మేకర్స్ చెబుతున్నారు. ఈ పార్టీ సాంగ్‌లో విశేషమేమిటంటే.. పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణం అయిన వెంకటేష్, వరుణ్ తేజ్‌, హీరోయిన్లు కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారట. పూజా హెగ్డే స్పెషల్ డ్యాన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని.. వీళ్లందరని ఇలా తెరపై చూడడం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని చిత్రయూనిట్ తెలుపుతోంది. కాగా, నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. చిత్రం మే 27న థియేటర్లలో విడుదల కానుంది.

Updated Date - 2022-04-16T03:07:29+05:30 IST