kabhi eid kabhi diwali: వెంకటేశ్‌కు చెల్లిగా.. ఎవరంటే!

ABN , First Publish Date - 2022-05-16T23:01:08+05:30 IST

‘ఎఫ్‌2’(F3)కు కొనసాగింపుగా తెరకెక్కిన ‘ఎఫ్‌ 3’తో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు వెంకటేశ్‌(Venkatesh). ఈ సినిమా తర్వాత వెంకీ ఖాతాలో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. తన స్నేహితుడు సల్మాన్‌ఖాన్‌ కోసం బాలీవుడ్‌లో ఓ సినిమా అంగీకరించారు వెంకటేశ్‌.

kabhi eid kabhi diwali: వెంకటేశ్‌కు చెల్లిగా.. ఎవరంటే!

‘ఎఫ్‌2’(F3)కు కొనసాగింపుగా తెరకెక్కిన ‘ఎఫ్‌ 3’తో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు వెంకటేశ్‌(Venkatesh). ఈ సినిమా తర్వాత వెంకీ ఖాతాలో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. తన స్నేహితుడు సల్మాన్‌ఖాన్‌ కోసం బాలీవుడ్‌లో ఓ సినిమా అంగీకరించారు వెంకటేశ్‌. సల్మాన్‌ఖాన్‌ (Salman khan)హీరోగా తెరకెక్కనున్న ‘కభీ ఈద్‌ కభీ దీపావళి’(kabhi eid kabhi diwali)లో వెంకటేశ్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. అయితే ఈ చిత్రంలో పూజా వెంకటేశ్‌కు చెల్లిగా నటించబోతున్నారని తెలిసింది. ఇటీవల ముంబైలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ మొదలైంది. ఫర్హాద్‌ సంజీ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో వెంకటేశ్‌ కూడా షూటింగ్‌లో పాల్గొనున్నారు. వెంకటేశ్‌, పూజా హెగ్డే (pooja hegde)ఈ చిత్రంలో భాగంకావడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ‘ఎఫ్‌3’లో పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతంలో నటించారు. 


Updated Date - 2022-05-16T23:01:08+05:30 IST