Cannes Film Festivalలో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం.. Pooja Hegde రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-12T17:28:30+05:30 IST

టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు చేస్తూ గుర్తింపు పొందిన నటి పూజా హేగ్డే (Pooja Hegde)...

Cannes Film Festivalలో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం.. Pooja Hegde రియాక్షన్ ఏంటంటే..

టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు చేస్తూ గుర్తింపు పొందిన నటి పూజా హేగ్డే (Pooja Hegde). వరుస సినిమాలతో దూసుకోపోతున్న ఈ బ్యూటీ త్వరలో ప్రముఖ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించనుంది. ఇప్పటికే ఈ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలిగా దీపికా పదుకొనే (Deepika Padukone) వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటి పూజా హెగ్డే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ బ్యూటీ మే 16న ఫ్రాన్స్‌కు వెళ్లనుంది. అనంతరం మే 17, 18 తేదీలలో జరిగే ప్రొగామ్స్‌లో పాల్గొననుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ నటులు (Popular Actors) ఆతిథ్యం ఇచ్చే పార్టీకి ఈ భామ గెస్ట్‌గా హాజరు అవుతుంది.


దీని గురించి పూజా మాట్లాడుతూ.. ‘మొట్టమొదటగా భారతదేశానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మంచి గౌరవం దక్కడం గర్వంగా అనిపిస్తుంది. మన దేశానికి ఈ ఫెస్టివల్‌లో గొప్ప చరిత్రే ఉంది. 1946లో చేతన్ ఆనంద్ ‘నీచా నగర్’కి అత్యున్నత బహుమతి గెలుచుకుంది. అప్పటి నుంచే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌‌తో మనకు మంచి అనుబంధం మొదలైంది. భాష, భౌగోళిక, సంస్కృతి అడ్డంకులను అధిగమించడానికి సినిమాలు ఎంతో ఉపయోగపడతాయని నేను బలంగా నమ్ముతాను. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని ఎల్లప్పుడూ ఓ గౌరవంగా భావిస్తాను. భవిష్యత్తులోనూ ఇలాంటి అవకాశాలు మరిన్నీ రావాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-05-12T17:28:30+05:30 IST