Pooja hegde: అయ్యో.. పాపం..!

ABN , First Publish Date - 2022-08-08T00:47:01+05:30 IST

‘అయ్యో పాపం పూజాహెగ్డే’ అంటున్నారు నెటిజన్లు. మరికొందరు జాలి చూపిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న బుట్టబొమ్మ గురించి నెటిజన్లు ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారు అనుకుంటున్నారా? కారణం లేకపోలేదు. ఆమె ఖాతాలో పడాల్సిన సక్సెస్‌ మరో హీరోయిన్‌ ఖాతాలో పడింది అని అభిమానులు ఇలా బాధను వ్యక్తం చేస్తున్నారు.

Pooja hegde: అయ్యో.. పాపం..!

‘అయ్యో పాపం పూజాహెగ్డే’ (Pooja hegde)అంటున్నారు నెటిజన్లు. మరికొందరు జాలి చూపిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న బుట్టబొమ్మ గురించి నెటిజన్లు ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారు అనుకుంటున్నారా? కారణం లేకపోలేదు. ఆమె ఖాతాలో పడాల్సిన సక్సెస్‌ మరో హీరోయిన్‌ ఖాతాలో పడింది అని అభిమానులు ఇలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ఆ సక్సెస్‌ అనుకుంటున్నారా? ఎమోషనల్‌ లవ్‌స్టోరీతో తెరకెక్కి శుక్రవారం విడుదలైన ‘సీతారామం’(Seetha ramam) చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. హీరోహీరోయిన్లతోపాటు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరొచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తున్నారు. దానికి పూజాహెగ్డేకు సంబంధం ఏముంది అనుకుంటున్నారా?


ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal takur) పోషించిన సీతామహాలక్ష్మీ పాత్రకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అసలు ఈ పాత్ర కోసం తొలుత పూజా హెగ్డేను సంప్రదించారట. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలో కీలక పాత్ర అయిన సీత పాత్రకు పూజా అయితే వంద శాతం న్యాయం చేయగలదని దర్శకుడు హను రాఘవపూడి భావించారని సినిమా ప్రారంభంలో టాక్‌ వచ్చింది. కథ నచ్చినప్పటికీ పూజాకు దక్షిణాది, ఉత్తరాది చిత్రాలతో బిజీ కావడం వల్ల డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక  నో అన్నారు. అప్పుడు సీత పాత్రకు మృణాల్‌ని, మరో కీలక పాత్రకు రష్మిక మందన్నాను ఓకే చేశారు దర్శకుడు.  సీత అలియాస్‌ నూర్జహాన్‌ పాత్రలో మృణాల్‌ నటన ఎంతగానో ఆకట్టుకోవడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని వదులుకున్నందుకు పూజా హెగ్డేను చూసి జాలి పడుతున్నారు నెటిజన్లు. ‘హిట్‌ లవ్‌స్టోరీని వదులుకుంది పాపం పూజా’ అని  నెట్టింట పోస్టులు పెడుతున్నారు.


Updated Date - 2022-08-08T00:47:01+05:30 IST