Pooja Hegde: వరుస ఫ్లాప్స్..అయినా డేరింగ్ స్టెప్..

ABN , First Publish Date - 2022-05-19T16:59:26+05:30 IST

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) నటించిన సినిమాలు వరుసగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) మూవీతో హిట్ అందుకున్న పూజా.

Pooja Hegde: వరుస ఫ్లాప్స్..అయినా డేరింగ్ స్టెప్..

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) నటించిన సినిమాలు వరుసగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) మూవీతో హిట్ అందుకున్న పూజా.. ఆ తర్వాత రాధే శ్యామ్ (Radhe Shyam), బీస్ట్ (Beast), ఆచార్య (Acharya) సినిమాలలో నటించింది. ఈ మూడు సినిమాలు పెద్ద గ్యాప్ లేకుండానే ప్రేక్షకుల ముందుకువచ్చి ఫ్లాప్స్‌గా మిగిలాయి. అయినా పూజా క్రేజ్ తగ్గలేదు. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), సమంత (Samantha), అనుష్క (Anushka).. లాంటి స్టార్ హీరోయిన్ల జోరు తగ్గాక... ఒక్కసారిగా రేస్‌లోకి వచ్చిన పూజా హెగ్డే, చాలామంది డైరెక్టర్లకు నిర్మాతలకు లక్కీ హీరోయిన్‌గా మారింది. గత రెండు మూడేళ్ళలో పూజ నటించకుండా, ఒక్క పెద్ద హీరో సినిమా విడుదల కాలేదు.. అంటే పూజ టైం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 


బాలీవుడ్ టు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్‌గా, సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తూ ఉంది పూజ. అయితే, ఇటివలే పూజా హెగ్డే నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించిన రాధేశ్యామ్, రామ్ చరణ్‌తో నటించిన ఆచార్య.. రెండూ కూడా అట్టర్ ఫ్లాపయ్యాయి. దీంతో ఇప్పుడు పూజా హెగ్డే అంటే భయపడే పరిస్థితి ఇండస్ట్రీలో నెలకొంది. అయినా అమ్మడు డేరింగ్ స్టెప్ వేసింది.


స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న పూజ హెగ్డే, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ - విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమాలో వెంకీ చెల్లెలి పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యింది. “కబీ ఈద్ కబీ దివాలి” టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్.. త్వరలో మొదలవబోతోంది. ఈ మూవీలోనే పూజా హెగ్డే - వెంకటేష్ అన్నా చెల్లెలుగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ “కబీ ఈద్ కబీ దివాలి” సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. తన రోల్ నచ్చడం, బాలీవుడ్ మూవీ కావడం, పైగా సల్మాన్ ఖాన్ హీరో కాబట్టే పూజా సిస్టర్ రోల్ చేయడానికి ఓకే చెప్పిన నట్టు తెలుస్తోంది. ఎంతైనా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ సిస్టర్ రోల్ చేయడం అనేది రిస్కీ అండ్ డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి.

Updated Date - 2022-05-19T16:59:26+05:30 IST