Ponniyin Selvan: వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం.. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టిన కోలీవుడ్ సినిమాగా రికార్డు!

ABN , First Publish Date - 2022-10-02T22:14:08+05:30 IST

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.

Ponniyin Selvan: వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం.. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టిన కోలీవుడ్ సినిమాగా రికార్డు!

మణిరత్నం (Mani Ratnam) కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. జయం రవి, ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నియిన్ సెల్వన్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.  ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల అయింది. మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొడుతుంది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 2022లో బిగ్గెస్ట్ కోలీవుడ్ ఒపెనర్‌గా నిలిచింది. 


విజయ్ నటించిన ‘బీస్ట్’, అజిత్ ‘వలీమై’ రికార్డులను ‘పొన్నియిన్ సెల్వన్’ అధిగమించిందని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ తొలి రోజు తమిళనాడులో రూ.25.86కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.5.93కోట్లు, కర్ణాటకలో రూ.5కోట్లు, కేరళలో రూ.3.7కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.3.5కోట్లు, ఓవర్సీస్‌లో రూ.35కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.80కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి బిగ్గెస్ట్ కోలీవుడ్ ఒపెనర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. మూవీ వరుసగా మూడు రోజుల పాటు 1మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను సాధించడం విశేషం. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ ఓవర్సీస్ వసూళ్లను 2.6మిలియన్ డాలర్స్‌ను ఈ చిత్రం 3రోజుల్లోనే అధిగమించింది. ఇప్పటికే 3.3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. పూర్తి రన్‌లో ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన చిత్రాలుగా మొదటి రెండు స్థానాల్లో ‘2.o’ (5.5 మిలియన్ డాలర్స్), ‘కబాలి’ (4.5 మిలియన్ డాలర్స్) ఉన్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ ఇదే జోష్ కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాలను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Updated Date - 2022-10-02T22:14:08+05:30 IST