Ponniyin Selvan: కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం.. అత్యంత వేగంగా..

ABN , First Publish Date - 2022-10-08T02:02:00+05:30 IST

స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి.

Ponniyin Selvan: కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం.. అత్యంత వేగంగా..

స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్, మద్రాస్ టాకీస్  సంయుక్తంగా నిర్మించాయి. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల పొన్నియిన్ సెల్వన్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. జయం రవి,  ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల అయింది. ఈ చిత్రాన్ని రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది.  


‘పొన్నియిన్ సెల్వన్’ విడుదలైన తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.325కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ను రాబట్టిన ఆరో తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. గతంలో ‘2.0’, ‘ఎంథిరన్’, ‘కబాలి’, ‘బిగిల్’, ‘విక్రమ్’ (Vikram) ఈ ఫీట్‌ను సాధించాయి. వీకెండ్ వరకు ఈ వసూళ్లు రూ.350కోట్లను దాటుతాయని అంచనా. ‘కబాలి’, ‘ఎంథిరన్’ కలెక్షన్స్‌ను ఈ సినిమా అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’ తొలి రోజు రూ.80కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని చిత్ర బృందం ప్రకటించింది. తమిళనాడులో అత్యంత వేగంగా రూ.100కోట్ల కలెక్షన్స్‌ను సాధించిన చిత్రంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చోళుల కాలం నాటి కథతో రూపొందించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహించాడు. ప్రొడక్షన్ డిజైనర్‌గా తోట తరణి వ్యవహరించాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం విడుదలయిన 6నెలల నుంచి 9నెలల తర్వాత రెండో భాగం విడుదల కానుందని మేకర్స్ తెలిపారు.

Updated Date - 2022-10-08T02:02:00+05:30 IST