Ponniyin Selvan 1 : తెలుగు వాళ్ళు చూస్తారా?

ABN , First Publish Date - 2022-09-07T19:32:09+05:30 IST

దర్శకుడు మణిరత్నం (Maniratnam) నుండి ఒక సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. ఈసారి మణిరత్నం తమిళ్ చరిత్రని కథగా ఎంచుకొని పిఎస్-1 అనే సినిమా పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నారు.

Ponniyin Selvan 1 : తెలుగు వాళ్ళు చూస్తారా?

దర్శకుడు మణిరత్నం (Maniratnam) నుండి ఒక సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. ఈసారి మణిరత్నం తమిళ్ చరిత్రని కథగా ఎంచుకొని పిఎస్-1 అనే సినిమా పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నారు. కల్కి కృష్ణమూర్తి అనే అయన రాసిన కల్పిత నవల పొన్నియన్ సెల్వన్ 1 (Ponniyin Selvan 1 ) చిత్రానికి ఆధారం. రెండు భాగాలుగా విడుదల అవుతోంది. ఈ సినిమా కథ పూర్తిగా తమిళులకి సంబందించినది. ఆ కథలోని రాజుల, వ్యక్తుల, రాజ్యాల పేర్లు కూడా తమిళ్ భాషకి ఆధారంగా ఉంటాయి. 1950వ దశకంలో కల్కి తన నవలని ఒక పత్రికలో ధారావాహిక సీరియల్ గా వేసి తరువాత నవలగా తెచ్చాడు. 


అయితే, ఇంత తమిళ్ వున్నా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత అభిమానంతో, ఆదరణతో థియేటర్ కి వచ్చి చూస్తారా అన్నదే ప్రశ్న. మణిరత్నం భారత దేశం గర్వించ దగ్గ దర్శకుల్లో ఒకరు. అందులో సందేహం లేదు. కానీ, అతను ఈసారి ఎంచుకున్న కథ, పూర్తిగా తమిళ్ సాహిత్యం, తమిళ్ చరిత్రకి సంబందించినది. గతంలో చాలా సినిమాలు భారతీయ చరిత్ర ఆధారంగా తీసినవి తెలుగులో విడుదల అయినా, అవి అంతగా ఇక్కడ ప్రజాదరణ పొందలేదు. మొదటి కారణం అలాంటి సినిమాలు ఒరిగినల్స్ గా చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతూ వుంటారు. సాంఘీక సినిమాలు తెలుగులో విడుదల అవటం వేరు, అవి ఇక్కడ సక్సెస్ అవటం వేరు. 


కానీ, ఇప్పుడు మణిరత్నం సినిమా మొత్తంగా తెలుగు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనిది. ఈ సినిమా కథ శ్రీ లంకతో చాలా ముడిపడి వుంది. నవల ప్రకారం అయితే అసలు కథ అక్కడే మొదలవుతుంది కూడా. ఈ నవల రాసిన కల్కి చాలా సార్లు శ్రీ లంక వెళ్లి వచ్చాడు కూడా. అందుకని ఈ సినిమా తెలుగు వాళ్లకు అంత నచ్చకపోవచ్చు అని పరిశ్రమలో కొందరు అంటున్నారు. ఒకటి మాత్రం నిజం, మణిరత్నం సినిమా అంటే చెవి కోసుకుని ప్రేక్షకులు వున్నారు కానీ, వాళ్ళు మొదటి రోజు చూస్తారు, కానీ రెండో రోజు నుండి ప్రేక్షకులు వస్తారో లేదో చూడాలి. ఓ టి టి లో వస్తుంది కదా అక్కడ చూడొచ్చు అన్న ధోరణి కూడా చాల మంది ప్రేక్షకుల్లో వుంది కదా. తెలుగు సినిమా హక్కులు కొన్న నిర్మాతకి ఒక పరీక్ష లాంటిదే ఈ సినిమా.

Updated Date - 2022-09-07T19:32:09+05:30 IST