Ponniyin Selvan 1: అక్కడ రోబో 2.0 ని దాటేసిన మణిరత్నం మూవీ.. కేవలం ఐదు రోజుల్లోనే..

ABN , First Publish Date - 2022-10-10T16:17:58+05:30 IST

మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ 1 బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళుతోంది. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా..

Ponniyin Selvan 1: అక్కడ రోబో 2.0 ని దాటేసిన మణిరత్నం మూవీ.. కేవలం ఐదు రోజుల్లోనే..

మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ 1 బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళుతోంది. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పలు చోట్ల రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా వసూళ్లలో మరో రికార్డుని క్రియేట్ చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా మారింది. కేవలం ఐదు రోజుల్లోనే ఐదు మిలియన్ల డాలర్లు సాధించింది. అది రోబో 2.0 జీవితకాల ఓవర్సీస్ కలెక్షన్ల కంటే ఎక్కువ.


ఈ విషయాన్ని తెలుపుతూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సరిగమ సినిమాస్ ట్వీట్ చేసింది. అందులో.. ‘పొన్నియిన్ సెల్వన్ 1 అమెరికా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. USAలో ఆల్ టైమ్ హైయెస్ట్ కోలీవుడ్ గ్రాసర్‌గా నిలిచింది’ అని రాసుకొచ్చింది. అంతకుముందు రోజు చేసిన మరో ట్వీట్‌లో.. ‘అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇంకా పెద్దది అవుతోంది. పొన్నియిన్ సెల్వన్ $5 మిలియన్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. వారాంతంలో 2.Oని దాటి యూఎస్‌ఏలో ఆల్ టైమ్ నెం.1 గ్రాసర్‌గా అవతరించడానికి సిద్ధంగా ఉంది’ అని రాసుకొచ్చింది.


పాన్ ఇండియా స్థాయిలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు.





Updated Date - 2022-10-10T16:17:58+05:30 IST