Ponniyin Selvan - 1: ట్రైలర్‌తో తారాస్థాయి అంచనాలు..

ABN , First Publish Date - 2022-09-07T16:58:12+05:30 IST

అగ్ర దర్శకుడు మణిరత్నం (Maniratnam) మార్క్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1 (Ponniyin Selvan - 1).

Ponniyin Selvan - 1: ట్రైలర్‌తో తారాస్థాయి అంచనాలు..

అగ్ర దర్శకుడు మణిరత్నం (Maniratnam) మార్క్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్ 1 (Ponniyin Selvan - 1). తాజాగా ఈ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. చోళుల స్వర్ణయుగాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి సిద్ధమవుతున్నారు మణిరత్నం. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. 


చియాన్ విక్రమ్‌ (Vikram), కార్తి (Karthi), జయం రవి, ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai), త్రిష (Trisha), ఐశ్వర్య లక్ష్మీ, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ విడుదల చేశారు.


‘వెయ్యి సంవత్సరాల క్రితం చోళనాట స్వర్ణశకం ఉదయించక మునుపు ఒక తోకచుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళరాజ కులంలో ఒకరిని ఆ తోకచుక్క బలిగోరుతుందంటున్నారు జ్యోతిష్యులు. దేశాన్ని పగలు, ప్రతీకారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. వంచన.. ద్రోహం రాజమందిరంలోకి చొచ్చుకుపోతున్నాయి’.. అంటూ రానా దగ్గుబాటి వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మణిరత్నం మార్క్ మేకింగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేసింది. తప్పకుండా పీఎస్ 1 భారీ విజువల్ వండర్‌గా నిలుస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి.. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్‌తో చారిత్రాత్మక కథలను ప్రపంచానికి చూపించారు. ఈ క్రమంలో మణిరత్నం చేసిన పొన్నియన్ సెల్వన్ - 1 ఏ విధంగా ఆకట్టుకుంటుందో..ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. 



Updated Date - 2022-09-07T16:58:12+05:30 IST